Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అత్యంత సామరస్యమేదో అదే చేశా: షోయబ్

Shoaib Malik
కరాచీ: హేతువుకు అందని పరిస్థితి ఏర్పడినప్పుడు అత్యంత సామరస్య పూర్వకమైంది ఏదో అదే చేశానని పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ అన్నారు. అయేషా సిద్దిఖికి విడాకులు ఇచ్చిన విషయంపై ఆయన ఆ విధంగా అన్నారు. ఈ మేరకు ఆయన తన ఏజెంటు ద్వారా గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. తాను అల్లాకు ప్రప్రథమంగా కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఆయన చెప్పారు. పరిస్థితిని ఎదుర్కోవడానికి తనకు బలాన్నిచ్చిన మీడియాకు, పాకిస్తాన్ దేశానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

పైవాడికి సత్యం తెలుసునని, అందువల్ల ఏది సరైంది, ఏది కాదని చెప్పడానికి తాను న్యాయమూర్తిని కానని, ప్రతి రోజూ పరిస్థితి హేతువుకు అందకుండా మారిపోతుంటే సామరస్యానికి అవసరమైనది ఏదో అదే చేశానని ఆయన అన్నారు. మీడియా తన కుటుంబంలో భాగమని, సానియాతో తన వివాహ జీవితం అందమైన ప్రయాణంగా సాగాలని మీడియా ప్రార్థించాలని కోరుతున్నానని ఆయన అన్నారు. పాకిస్తానీగా తాను గర్వపడుతున్నానని, సానియాను తన దేశప్రజలంతా ఆహ్వానిస్తున్నారని, తమకు మద్దతిచ్చిన ప్రతి ఒక్కరినీ తాను, సానియా కలుస్తామని ఆయన చెప్పారు. ఎవరినైనా తాను బాధపెట్టి ఉంటే క్షమించాలని ఆయన కోరారు.
Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+