Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఏం సాధించినా అనుమానంగా చూశారు: పూనియా

న్యూఢిల్లీ: ఎన్నో ఏళ్లుగా అధికారులు తనను చిన్న చూపు చూశారని ఆసియా గేమ్స్ డిస్కస్ త్రోలో బంగారు పతకం సాధించిన సీమా పూనియా పేర్కొంది. జాతీయ సమాఖ్య కూడా తన పట్ల సరిగా వ్యవహరించలేదని తెలిపింది.

గత 14 ఏళ్లుగా మెరుగైన ప్రదర్శన చేస్తున్నా అధికారులు తనపై సవతి ప్రేమను ప్రదర్శిస్తున్నారంటూ వాపోయింది. "నేను జూనియర్ ఛాంపియన్ షిప్‌‍లో పతక విజేతను. వరుసగా మూడు సార్లు కామన్ వెల్త్ క్రీడర్లో పతకాలు గెలిచా. ఇప్పుడు ఇంచియాన్‌లో స్వర్ణ పతకం సాధించా. దశాబ్దానికి పైగా ఉన్న నా సుదీర్గ కెరరీలో దేశానికి ఎంతో కీర్తిని తీసుకొచ్చా. కానీ నేను ఏం సాధించినా అనుమానంగా చూశారు. ఇది న్యాయం కాదు" అని సీమా పూనియా తన గోడును వెళ్లబోసుకుంది.

I have been treated badly for years by authorities: Seema Punia

2000 ప్రపంచ జూనియర్ ఛాంపియన్ షిప్‌లో సీమా పూనియా బంగారు పతకం సాధించింది. ఆ తర్వాత జరిగిన డోప్ పరీక్షల్లో దొరకడంతో ఆ పతకాన్ని వెనక్కి తీసుకున్నారు. హర్యానాలో జన్మించిన సీమా పూనియా డిస్కస్ త్రో‌లో 2004 నుంచి 2012 వరకూ నేషనల్ రికార్డుని తన పేరు మీద నమోదు చేసింది.

డిస్కస్ త్రోయర్ సీమా పునియా అద్వితీయ ప్రతిభ భారత్‌కు 17వ ఆసియా క్రీడల్లో తొలి అథ్లెటిక్స్ స్వర్ణాన్ని అందించింది. ఏషియాడ్‌లో సీమకు ఇదే మొదటి పతకం. నాలుగో ప్రయత్నంలో డిస్కస్‌ను 61.03 మీటర్ల దూరానికి విసిరిన ఆమె అగ్రస్థానాన్ని సంపాదించింది.

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+