Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

జట్టు ఎంపికపై ఆవేదన: 'టీమిండియా ప్రపంచకప్ ఫైనల్‌కు చేరకపోవచ్చు'

ముంబై: ఆస్టేలియా-న్యూజిలాండ్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఐసీసీ వరల్డ్ కప్ టోర్నమెంట్‌కు ఎంపిక చేసిన భారత జట్టులో సీనియర్లకు చోటు కల్పించకపోవడాన్ని బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టిని నిరుత్సాహాన్ని గురిచేసిందన్నాడు.

ప్రస్తుత వరల్డ్ కప్‌లో మ్యాచ్‌లను వీక్షించాలని ఏమాత్రం జోష్ లేదన్నాడు. సీనియర్లను పక్కన బెట్టడం తనకెంతో అంసతృప్తిని కలిగించిందన్నాడు. భారత క్రికెట్‌ జట్టుకు సీనియర్ ఆటగాళ్లు ఎన్నో సేవలు అందించారని, వారికి ఇప్పుడు జట్టులో చోటు లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు.

ముఖ్యంగా 2011 వరల్డ్ కప్‌లో ముఖ్య భూమిక పోషించిన యువరాజ్ సింగ్, జహీర్ ఖాన్‌ను తప్పించడం నిరాశకు గురిచేసిందన్నాడు. వరల్డ్ కప్‌కు అనుభవం ఉన్న ఆటగాళ్లను పంపితే వచ్చే నష్టమెంటో సెలక్షన్ కమిటీ సభ్యుల లాజిక్ తనకు అర్ధం కాలేదన్నారు.

 I doubt the Indian team will make it to World Cup finals says Suniel Shetty

యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడాన్ని తాను తప్పుబట్టడం లేదని, వాళ్లు ఏమాత్రం మైదానంలో ప్రదర్సిస్తారనేది తెలియడం లేదన్నారు. ఈ వరల్డ్ కప్‌లో యువ ఆటగాళ్లైన అక్షర పటేల్, భువనేశ్వర్ కుమార్‌లతో టీమిండియా నూతనంగా ఉందన్నారు. వరల్డ్ కప్‌కి చాలా ప్రాక్టీస్ అవసరం.

మరింత అనుభవం వచ్చిన తర్వాత వారిని ప్రపంచకప్ పోరుకు పంపితే బాగుండేదని అభిప్రాయపడ్డారు. జట్టులో కూడా బౌలర్లు చాలా తక్కువగా ఉన్నారని, అసలు మ్యాచ్‌లు ఎలా గెలుస్తారో ఆశ్చర్యంగా ఉందన్నారు.

విరాట్ కోహ్లికి మంచి భవిష్యత్ ఉందని పేర్కొన్నారు. టీమిండియా ప్రపంచకప్ ఫైనల్‌కు చేరకపోవచ్చని అభిప్రాయపడ్డారు. సెమీ ఫైనల్స్‌కు దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఆస్టేలియా, ఇండియా చేరుకుంటాయన్నారు. ఈ ఏడాది వరల్డ్ కప్‌ను దక్షిణాఫ్రికా గెలుచుకునే అవకాశముందని సునీల్ శెట్టి అంచనా వేశారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:23 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+