For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

షోయబ్ సంగతి నాకు తెలియదు: అజర్

By Pratap
Mohammed Azharuddin
న్యూఢిల్లీ/హైదరాబాద్: హైదరాబాద్ అమ్మాయి అయేషా, పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ల వ్యవహారం తనకేమీ తెలియదని భారత మాజీ క్రికెటర్, పార్లమెంటు సభ్యుడు మహ్మద్ అజరుద్దీన్ అన్నారు. తనను ఈ వివాదంలోకి లాగవద్దని ఆయన సోమవారం అన్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజ్ రెసిడెన్సీలో తాను, షోయబ్ కలిసి ఉన్నప్పుడు అజర్ చూశారని, దీనికి అజర్ సాక్షి అని అయేషా పోలీసులకు చెప్పినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై ఆజర్ ఆ విధంగా ప్రతిస్పందించారు.

కాగా, అయేషా, షోయబ్ వ్యవహారంపై అయేషా న్యాయవాది రెహ్మాన్, వైద్యుడు సయ్యద్ బాబర్ చెప్పారు. వారిద్దరు 14 సార్లు కలిశారని వారు చెప్పారు. వారు సోమవారం హైదరాబాదులో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. షోయబ్ మాలిక్ చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని వారన్నారు. అయేషా తీవ్ర ఒత్తిడిలో ఉందని, అందుకే మీడియాకు దూరంగా ఉంటోందని వారు చెప్పారు. పెళ్లికి సాక్షులు చాలా మంది ఉన్నారని వారు చెబుతున్నారు.
Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+