19న బౌట్‌పై మాటల యుద్ధం: విజేందర్Xసామెట్
మాంచెస్టర్: 'సారీ భారత్, విజేందర్‌కు ఓటమి తప్పదు' అన్న బల్గేరియా బాక్సర్ సామెట్ హ్యూసెనోవ్‌కు భారత్ స్టార్ విజేందర్ సింగ్ మరోసారి కౌంటర్ ఇచ్చాడు. సామెట్‌ను మట్టికరిపించేందుకు తనకు అదనపు రౌండ్లు అవసరం లేదని, నేను ఇప్పుడు ఫామ్‌లో ఉన్నానని, ఆరు రౌండ్లు అడగలనని విజేందర్ చెప్పాడు.
అయితే సామెట్‌తో పోరులో అన్ని రౌండ్లు తనకు అవసరం లేదని, మూడు రౌండ్లు చాలనుకుంటున్నానని చెప్పాడు. బలమైన పంచ్‌లు విసిరితే అతడు ఎక్కువసేపు నిలువలేడని విజేందర్ అన్నాడు. ఇటీవల, నీ ఎముకలు విరిచి పంపిస్తానని సామెట్ అనగా విజేందర్ నవ్వేశాడు. ఇప్పుడు మరోసారి గట్టి కౌంటర్ ఇచ్చాడు.
అత్యంత ప్రమాదకర బాక్సర్‌గా పేరున్న సామెట్‌తో 19న విజేందర్ మూడో ప్రొఫెషనల్ బౌట్ ఆడనున్నాడు. ఈ నేరథ్యంలో వారి మధ్య మాటల యుద్ధం మరింత ఆసక్తిని కలిగిస్తోంది. తనను తేలిగ్గా కొట్టిపారేసినందుకు విజేందర్ విచారించక తప్పదని సామెట్ అంటున్నాడు.

తనను అవమానించినందుకు అతడు మూల్యం చెల్లించుకోక తప్పదని, తన ముందు అతడు చిన్న పిల్లాడని, వయసు కేవలం రెండు బౌట్లేనని, కానీ పెద్ద ప్రపంచ ఛాంపియన్‌లా మాట్లాడుతున్నాడని, తననెంతో అగౌరవపరిచాడన్నాడు.
మూడు రౌండ్లలోనే నా పని ముగిస్తానని చెప్పడం ద్వారా తన పోరాట తత్వాన్ని ప్రశ్నించాడని, అదో పెద్ద జోక్ అని సామెట్ అన్నాడు. విజేందర్ అలా అన్నందుకు కచ్చితంగా బాధపడేలా చేస్తానని చెప్పాడు. శనివారం బౌట్ చూడండని, ఆరు రౌండ్లు అవసరం లేదని విజేందర్ అన్నాడని, కానీ నేను అతణ్ని సిక్స్ కొడతానని సామెట్ అన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications