బెంగళూరు: వరుసగా ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాది టీమిండియా హిట్టర్ యువరాజ్‌సింగ్ రికార్డును సమం చేసినట్లు వస్తున్న వార్తలను టీమిండియా మహిళా జట్టు కెప్టెన్ మిథాలీరాజ్ ఖండించారు. అది కేవలం వదంతి మాత్రమేనని స్పష్టం చేశారు.
ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తున్న వీడియో ఫుటేజీ ఆస్ట్రేలియా పర్యటనకు ముందు భారత్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌కు చెందిందని.. ఆ ఫుటేజీ నిజమైనదే అయినా.. అందులో తాను ఆరు సిక్సర్లు కొట్టలేదని వెల్లడించారు.

ఇప్పటి వరకు 164 వన్డేలు, 10 టెస్టు మ్యాచ్‌లు ఆడిన మిథాలీరాజ్ కెరీర్‌లో 5,964 పరుగులు చేసింది. భారత్ తరఫున 5,000 పరుగులు చేసిన తొలి మహిళా క్రికెటర్‌గా, అంతర్జాతీయంగా రెండో క్రికెటర్‌గా ఆమె రికార్డు సృష్టించారు.
ఆస్ట్రేలియా పర్యటనకు ముందు భారత్ లో న్యూజిలాండ్ తో ఆడిన సందర్భంగా ఒకే ఓవర్ లో ఎక్కువ పరుగులు సాధించినప్పటికీ ఆరు సిక్సర్లు కొట్టలేదని వెల్లడించింది. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న వీడియో నకిలీదని, పలు సందర్భాల్లో కొట్టిన షాట్లను ఎడిట్ చేశారని ఆమె స్పష్టం చేసింది.