పాక్‌పై సాధించిన పతకం తెలంగాణకే అంకితం: నైనా
హైదరాబాద్: పాకిస్దాన్‌లో జరిగిన సౌత్ ఏషియన్ జూనియర్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌లో తాను సాధించిన బంగారు పతకాన్ని తెలంగాణ ప్రజలకు అంకితమిస్తున్నట్లు టేబుల్ టెన్నిస్ స్టార్ నైనా జెస్వాల్ పేర్కొన్నారు. మంగళవారం లాల్ బహుదూర్ ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఏ పనినైనా కష్టపడి కాకుండా ఇష్టపడి చేయాలన్న సంకల్పంతో ముందుకు సాగితే విజయాలు వరిస్తాయని పేర్కొన్నారు.
మహిళలు నిరుత్సాహానికి గురి కాకుండా పట్టుదలతో లక్ష్య సాధనలో దుసుకుపోవాలని సూచించింది. అంతక ముందు పద్మశ్రీ, ద్రోణాచార్య అవార్డు గ్రహీత ఎస్.ఎం. ఆరీఫ్ మాట్లాడుతూ క్రమశిక్షణ క్రీడాకారులకు ఎంతో ముఖ్యమని, అది నైనాలో కనిపిస్తుందన్నారు. క్రీడల్లో భారత ఆశాద్వీపంగా వెలుగుతున్న నైనా జెస్వాల్‌కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తోడ్పాటుగా ఉండాలని కోరారు.
బాడీ బిల్డింగ్ కోచ్ ఏతెషామ్ అలీ, నైనా తండ్రి అశ్విన్ జెస్వాల్, టెబుల్ టెన్నిస్ అంతర్జాతీయ క్రీడకారుడు పద్మశ్రీ మీర్ ఖాసిమ్ అలీ, కోచ్ ఇబ్రహిం ఖాన్ తదితరులు సమావేశంలో పాల్గోని మాట్లాడారు. అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ మ్యాచ్‌ల్లో నైనా జెస్వాల్ అండర్ 12, అండర్ 14, అండర్ 16 కేటగిరీల్లో హ్యాట్రిక్ మెడల్స్‌ను సాధించింది.

పాక్‌పై సాధించిన పధకం తెలంగాణకే అంకితం
జూనియర్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌లో తాను సాధించిన బంగారు పధకంతో టేబుల్ టెన్నిస్ స్టార్ నైనా జెస్వాల్ .

పాక్‌పై సాధించిన పధకం తెలంగాణకే అంకితం
టేబుల్ టెన్నిస్ స్టార్ నైనా జెస్వాల్ సన్మానిస్తున్న అధికారులు. బాడీ బిల్డింగ్ కోచ్ ఏతెషామ్ అలీ, నైనా తండ్రి అశ్విన్ జెస్వాల్, టెబుల్ టెన్నిస్ అంతర్జాతీయ క్రీడకారుడు పద్మశ్రీ మీర్ ఖాసిమ్ అలీ, కోచ్ ఇబ్రహిం ఖాన్ తదితరులు సమావేశంలో పాల్గోని మాట్లాడారు.

పాక్‌పై సాధించిన పధకం తెలంగాణకే అంకితం
తాను సాధించిన బంగారు పధకాన్ని కొరుకుతున్న టేబుల్ టెన్నిస్ స్టార్ నైనా జెస్వాల్

పాక్‌పై సాధించిన పధకం తెలంగాణకే అంకితం
అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ మ్యాచ్‌ల్లో నైనా జెస్వాల్ అండర్ 12, అండర్ 14, అండర్ 16 కేటగిరీల్లో హ్యాట్రిక్ మెడల్స్‌ను సాధించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications