Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బాలీవుడ్ నుండి ఆఫర్స్ వస్తున్నాయి: షేన్‌వార్న్

Shane Warne
క్రికెట్ అతని ప్రాణం. అలాంటి క్రికెట్ నుండి అన్ని ఫార్మెట్స్ నుండి తప్పుకున్నారు ప్రఖ్యాత లెగ్ స్పిన్నర్ షేన్‌వార్న్. 41సంవత్సరాల వయసు కలిగినటువంటి షేన్‌వార్న్ ఐపిఎల్‌లో రాజస్దాన్ రాయల్స్ టీమ్ కెప్టెన్‌గా అపూర్వ విజయాలను అందించారు. అలాంటి రాజస్దాన్ రాయల్స్ టీమ్ కెప్టెన్‌గా గత వారం తప్పుకున్న విషయం తెలిసిందే. దీంతో షేన్‌వార్న్ క్రికెట్ నుండి అన్ని ఫార్మెట్స్ నుండి కూడా తప్పుకోవడం జరిగింది. ఐతే క్రికెట్ నుండి తప్పుకున్న షేన్‌వార్న్‌కి బాలీవుడ్ నుండి ఆఫర్స్ వస్తున్నాయంట. సో దీనిని బట్టి షేన్‌వార్న్ త్వరలోనే బాలీవుడ్‌లో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించనున్నాడన్నమాట.

ఈ సందర్బంలో షేన్‌వార్న్ మాట్లాడుతూ ప్రస్తుతం నాకు బాలీవుడ్ నుండి ఆఫర్స్ వస్తున్నాయి. అవి ఆసక్తికరంగా ఉంటే చూద్దాం అని అనుకుంటున్నాను అని అన్నారు. గతంలో సచిన్ టెండూల్కర్‌తో కలసి పెప్సీ కంపెనీకి కొన్ని వాణిజ్య ప్రకటనలు చేసిన అనుభవం ఉంది. ఐతే సినిమాలలో కూడా నటించాలని నాకు చాలా ఆతృతగా ఉందని అన్నారు. షేన్‌వార్న్ ప్రియురాలు బ్రిటీష్ యాక్టర్ లిజ్ హార్లే ఇద్దరూ కలసి ముద్దు పెట్టుకుంటూ ఐపిఎల్ మ్యాచ్‌లలో ఫోటోలకు ఫోజులిచ్చినటువంటి సందర్బాలు అనేకం. ఐతే ఈ విషయంపై షేన్‌వార్న్‌ని ప్రశ్నించగా ఒకింత మౌనం వహించారు.

దాంతో విషయాన్ని ప్రక్కదోవ పట్టిస్తూ ప్రస్తుతం నేను 82కిలోలు బరువుతో, చూడడానికి చక్కగా మంచి హార్డ్ వర్క్ చేస్తూ మంచి శరీర సౌష్టవం కలిగిఉన్నానని అన్నారు. అంతేకాకుండా షేన్‌వార్న్ ఇటీవల కాలంలో స్పిన్నర్స్ ని తయారు చేసే పనిలో పడ్డారు. టీమ్‌లో ఉండేటటువంటి బాయ్స్ ధరించడానికి వీలుగా మంచి డిజైన్స్ వేర్స్‌ని షేన్‌వార్న్ కుమారుడు జాక్సన్‌తో కలసి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ఇది మాత్రమే కాకుండా నా పదకోండు సంవత్సరాలు వయసు కలిగినటువంటి కోడుకు జాక్సన్ కూడా టీమ్ మెంబర్స్‌తో కలసి వారి ప్రక్కనే కూర్చోని మరీ చర్చించుకోవడం జరుగుతుంది.

ఇక ఉమెన్స్ వేర్ విషయానికి వస్తే వారి కోసం ప్రత్యేకంగా స్పిన్ విజ్ ప్లాన్స్ రూపోందించడం జరిగింది. యంగ్స్ గర్ల్స్ విషయంలో నా కూతురు మాతో కలసి పని చేయడానికి చాలా ఆసక్తిగా ఉంది. దీనిని భవిష్యత్తులో రూపోందించనున్నాం. ఇండియన్ గల్లీలో ఆడుతున్నటువంటి క్రికెటర్స్ ప్రకాశవంతంగా ఉండేటటువంటి కలర్స్‌ని మాత్రమే ఇష్టపడడం జరుగుతుంది. అలాంటి వారికోసం మేము ప్రత్యేకంగా ఓ స్ఫెషల్ ఎడిషన్‌ను విడుదల చేయడం జరిగింది. దాని పేరు ఏంటంటే గల్లీ క్రికెట్ లెజెండ్స్.

ఇక ఐపిఎల్ నైట్ పార్టీల విషయానికి వస్తే అదంతా చాలా సరదగా ఉంటుంది. నేను గతంలో ఇండియన్ టూర్‌కి వచ్చినప్పుడు ఇండియన్ పుడ్‌కి కొంచెం ఇబ్బంది పడ్డాను. కానీ ఇప్పుడు పరిస్ధితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు నాకు ఇండియన్ పుడ్ అంత స్పైసీగా అనిపించడం లేదు. నాకు ఇప్పుడు చికెన్ టిక్కా అంటే చాలా ఇష్టం అని అన్నారు. ఇంతేకాకుండా షేన్‌వార్న్ ఎక్కువగా వివాదాలలో ఉన్నారు. గతంలో సౌత్ ఆప్రికా ఉమెన్‌తో సెక్సువల్ హెరాస్‌మెంట్ కేసు, బ్రిటిష్ యాక్టర్ ఎలిజిబెత్ హార్లేతో డేటింగ్, ఇటీవల రాజస్దాన్ రాయల్స్ అసోసియేషన్ సెక్రటరీ పిచ్‌ని సరిగ్గా తయారు చేయలేదని అతనిని అబద్దం ఆడేవాడు అని సంబోంధించడంతో దానికి గాను బిసిసిఐ $50,000 జరిమానా కూడా విధించడం జరిగింది.
Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+