For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఒలింపిక్స్: ఆమె మరో రికార్డ్, కార్మికురాలితో అసభ్యంగా ప్రవర్తించి బాక్సర్ అరెస్ట్

రియో డీ జెనిరో: రియో ఒలింపిక్స్ 2016లో హంగేరి భామ కటిన్‌కా హోస్జు మరో రికార్డు నెలకొల్పింది. ఇప్పటికే మహిళల 400 మీటర్ల వ్యక్తిగత మెడ్లేలో 4:26:36 నిమిషాల్లో లక్ష్యాన్ని చేరి ప్రపంచ రికార్డు సాధించిన ఈ భామ.. 200 మీటర్ల మహిళల వ్యక్తిగత మెడ్లేలోనూ 2:07:45 నిమిషాల్లో లక్ష్యాన్ని చేరి పసిడితో పాటు ఒలింపిక్‌ రికార్డును నెలకొల్పింది.

రెండో స్థానంలో ఫెల్ప్స్

అమెరికా స్విమ్మర్ మైకెల్ ఫెల్ప్స్.. మూడో రోజు గేమ్స్‌లలో భాగంగా సోమవారం 400X100 మీటర్ల ఫ్రీ స్టయిల్ టీం ఈవెంటులో బంగారంతో ఖాతను తెరిచాడు. అనంతరం జరిగిన 200 మీటర్ల బట్టర్ ఫ్లై సెమీ ఫైనల్లో వ్యక్తిగత రేసులో రెండో స్థానంలో నిలిచాడు. ఫైనల్‌కు అర్హత సాధించాడు.

Hungarian swimmer Katinka Hosszu's wins her second gold at Rio 2016

కాగా, ఫెల్ప్స్‌ 400 మీటర్ల రిలే పోటీల సందర్భంగా ఓ యాంకర్‌.. పూల్‌ నుంచి బయటకు వచ్చేందుకు చెయ్యి ఇచ్చినప్పుడు అందరినీ ఒకటి ఆకర్షించింది. ఫెల్ప్స్ భుజంపై పలు చోట్ల ఊదా రంగులో ఉన్న చుక్కలు కనిపించాయి. అవి కప్పింగ్‌ థెరపీ చేయించుకుంటే వచ్చే తాత్కాలిక మచ్చలు.

అసభ్య ప్రవర్తనతో పరువు తీశాడు

ఒలింపిక్‌ గ్రామంలో పనిచేస్తున్న ఓ కార్మికురాలితో నమిబియా బాక్సర్‌ జోనస్‌ అసభ్యంగా ప్రవర్తించాడు. ఒలింపిక్‌ గ్రామంలోని ఒక భవనం 11వ ఫ్లోర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. వెంటనే బాధితురాలు పోలీసుల్ని ఆశ్రయించడంతో వారు జోనస్‌ను అరెస్టు చేశారు. అతను క్రీడల్లో పాల్గొనే అవకాశం కోల్పోయాడు. జోనస్‌ ఒలింపిక్‌ ప్రారంభ వేడుకల్లో నమిబియా పతాకధారిగా వ్యవహరించాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:23 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+