తిరానా (అల్బానియా): తెలుగు తేజం కోనేరు హంపికి ప్రపంచ మహిళా చెస్ చాంపియన్ షిప్ టైటిల్ ను గెలుచుకునే అవకాశాలు తగ్గుతున్నాయి. కీలకమైన ఏడో రౌండ్ గేమ్ లో హంపీ చైనా క్రీడాకారిణి యిఫాన్ హౌ చేతిలో ఓటమి చవి చూసింది. ఈ గేమ్ కు ముందు 2 -4 స్కోరుతో వెనకబడిన హంపీ పది గేమ్ ల మ్యాచులో మూడు గేమ్ లు ఓడిపోయింది. చైనా క్రీడాకారిణి 5-2 స్కోరుతో ముందంజలో ఉంది. హంపీ విజయం సాధించాలంటే పూర్తిగా విజయ మార్గంలోకి రావాల్సి ఉంటుంది. ఈ గేమ్ లో 97 సార్లు పావులు కదిలాయి. ఈ మ్యాచులో ఇదే దీర్ఘమైన గేమ్. ఆటతీరు బాగా లేకపోవడం వల్లనే హంపీకి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. తాను అలసిపోలేదని, ఫామ్ లేకపోవడమే దానికి కారణమని హంపీ అంటోంది.