For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎవరీ మయంతి లాంగర్: బిన్నీ దశనే మార్చేసిన యాంకర్

By Pratap

మెల్‌బోర్న్‌: భారత్ ఆల్ రౌండర్ స్టువర్ట్ బిన్నీ, ప్రఖ్యాత క్రీడా జర్నలిస్టు, యాంకర్ మయంతి లాంగర్ ఒకరు ఆడుతుంటే, మరొకరు వ్యాఖ్యానం చేస్తారు. వీరిద్దరు ఇప్పుడు మైదానంలో స్టార్‌లై పోయారు. విడివిడిగా ఉన్నప్పుడు ఇద్దరికి పెద్ద గుర్తింపు లభించలేదు. పెళ్లితో ఒక్కటవ్వగానే ఇద్దరికీ దశ తిరిగింది. తాజాగా వరల్డ్‌కప్‌లో ఫీల్డ్ సాక్షిగా విశ్లేషణలు, ఇంటర్యూలతో కనువిందు చేస్తున్న హాట్ బేబీయే ఈ మయంతి.

స్టూవర్ట్ బిన్నీతో వసపిట్ట మయంతికి ఎలా జత కుదిరిందో తెలియదు గానీ వివాహం మాత్రం అయిపోయింది. పైగా వీరిది ప్రేమ వివాహం కావడం విశేషం. అయితే, బిన్నీ మయంతితో కోహ్లీ మాదిరిగా షో చేయలేదు. కోహ్లీ మాదిరి ఫీల్డ్ సాక్షిగా ఫ్లయింగ్ కిస్‌లు విసరడం, వెంటబెట్టుకొని తిరగడం వంటి పనులు చేయలేదు. మయంతిపై మనసుపడ్డాడు, ఆ వెంటనే ప్రపోజ్ చేశాడు, కూల్‌గా పెళ్లి చేసుకున్నాడు.

How Mayanti Langer changed the fortune of Stuart Binny

2012 సెప్టెంబర్‌లో వీరి వివాహం జరిగింది. ఐపీఎల్ తదితర టోర్నీల్లో హల్‌చల్ చేసిన మయంతికి సాకర్ అంటే పిచ్చి ప్రేమ. అదే ఆమెని మోస్ట్ గ్లామరస్ స్పోర్ట్స్ జర్నలిస్ట్‌గా నిలబెట్టింది. 2010 ఫీఫా వరల్డ్‌కప్, 2011 వరల్డ్‌కప్ రూపంలో భారీ ఈవెంట్లకు హోస్ట్‌గా చేసి విశేషంగా మార్కులు కొట్టేసిందీ 30 ఏళ్ల భామ. మయంతితో పెళ్లవ్వగానే బిన్నీ దశ కూడా మారిపోయింది.

ఐపీఎల్‌లో రాణించడం, తర్వాత ఇంగ్లండ్ పర్యటన ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన 31 ఏండ్ల బిన్నీ తాజాగా ఆస్ట్రేలియా పర్యటనలో వచ్చిన కొన్ని అవకాశాలనైనా వాడుకున్నాడు. అతను ఇప్పుడు ప్రపంచ కప్ పోటీల్లో తురుపు ముక్క కూడా కావచ్చు. మాజీ క్రికెటర్ రోజర్ బిన్నీ కుమారుడైన స్టువర్ట్ బిన్నీ మయంతి లాంగర్ వల్లనే తన దశ తిరిగిందని అంటాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+