Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇండియా వరల్డ్ కప్‌లో ఆడుతుంది: భూటియా

Bhutia
న్యూఢిల్లీ: భారత ఫుట్‌బాల్‌ జట్టు మాజీ కెప్టెన్‌, గత రెండు దశాబ్దాలలో అత్యధిక భాగం భారత ఫుట్‌బాల్‌కు ప్రతీకగా ఉన్న భాయ్‌చుంగ్‌ భూటియా అంతర్జాతీయ పోటీల నుంచి రిటైరవుతున్నట్లు బుధవారం ప్రకటించాడు. దీనితో భూటియా 16 ఏళ్ల విశిష్ట కెరీర్‌కు తెర పడినట్లయింది. బంతిని సూటిగా తన్నడంలో నైపుణ్యానికి 'సిక్కిమీస్‌ సై్నపర్‌"గా గణుతికెక్కిన 34 ఏళ్ల భూటియా న్యూఢిల్లీలో అఖిల భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఎఐఎఫ్‌ఎఫ్‌) ప్రధాన కార్యాలయంలో విలేకరుల గోష్ఠిలో తన నిర్ణయాన్ని ప్రకటించాడు. '16 సంవత్సరాల విశిష్ట అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ కెరీర్‌ నాది. దేశానికి ప్రాతినిధ్యం వహించిన ప్రతి క్షణాన్ని ఆనందించాను. ఈ క్రీడకు చేతనైనంతగా సేవలు అందించాను" అని అతను చెప్పాడు.

ఇంగ్లండ్‌లో భారత యువ జట్టు పర్యటన నుంచి మధ్యలో వైదొలగిన భూటియా రిటైర్‌మెంట్‌ ప్రకటించడం తథ్యమని ఊహాగానాలు సాగుతున్నాయి. భారత జట్టు ఇంగ్లండ్‌లో వచ్చే నెల పాకిస్తాన్‌, ఇంగ్లండ్‌ యువ జట్లతో మ్యాచ్‌లు ఆడనున్నది. భూటియా ఏడాదిగా గాయాలతో సతమతం అవుతున్నాడు. జనవరిలో ఖతార్‌లో ఏషియన్‌ కప్‌ టోర్నీలో అతను పావుగంట సేపు మాత్రమే ఆడగలిగాదు. గడచిన 27 ఏళ్లలో ఇండియా పాల్గొన్న అత్యంత ప్రతిష్ఠాకరమైన టోర్నీ అది. '2008లో ఎఎఫ్‌సి చాలెంజ్‌ కప్‌ను గెలవడం, ఏషియన్‌ కప్‌ టోర్నీకి అర్హత పొందడం నా కెరీర్‌లో అత్యుత్తమ క్షణాలు.

ఆ టోర్నమెంట్‌లో ఆడిన తరువాత రిటైర్‌ కావాలని భావించాను" అని అతను తెలియజేశాడు. 'అయితే నేను ఏషియన్‌ కప్‌లో 15 నిమిషాల సేపు మాత్రమే ఆడగలిగాను. రిటైర్‌ కావడానికి అది సరైన మార్గం కాదని భావించాను. ఆడడం కొనసాగించాలని అనుకున్నాను. కాని గాయాల కారణంగా గత ఏడెనిమిది మాసాలు నన్ను చాలా నిస్పృహకు గురి చేశాయి. అందువల్ల రిటైర్‌ కావాలని నిర్ణయించుకున్నాను" అని భూటియా చెప్పాడు. 2014 ప్రపంచ కప్‌ క్వాలిఫయర్‌లు, సన్నాహక మ్యాచ్‌లకు ఎంపిక చేసిన భారత జట్టులో నుంచి అతనిని తొలగించారు.

అయితే, తాను స్థాపించిన యునైటెడ్‌ సిక్కిమ్‌ ఎఫ్‌సి క్లబ్‌ తరఫున ఆడడాన్ని భూటియా కొనసాగిస్తాడు. భూటియా పదేళ్లకు పైగా భారత జట్టుకు సారథ్యం వహించాడు. అతను 43 అంతర్జాతీయ గోల్స్‌ స్కోర్‌ చేశాడు. దేశంలో మరే ఫుట్‌బాలర్‌ కూడా అన్ని గోల్స్‌ చేయలేదు. తన దేశానికి నూరు మ్యాచ్‌లకు పైగా ఆడిన కొద్ది మంది అంతర్జాతీయ క్రీడాకారులలో భూటియా ఏకైక భారతీయుడు. అతని సారథ్యంలో ఇండియా దక్షిణాసియా ఫుట్‌బాల్‌ సమాఖ్య (సాఫ్‌) చాంపియన్‌షిప్స్‌ను మూడు సార్లు, నెహ్రూ కప్‌ టైటిల్స్‌ను రెండు సార్లు (2007, 2009 సంవత్సరాలలో), 2008 ఎఎఫ్‌సి చాలెంజ్‌ కప్‌ను కైవసం చేసుకొంది. చాలెంజ్‌ కప్‌ విజయం వల్ల ఇండియా 1984 తరువాత మొదటిసారిగా ఏషియన్‌ కప్‌ టోర్నీకి అర్హత సంపాదించింది. 1976 డిసెంబర్‌ 15న నామ్చిలో జన్మించిన భూటియా భారత జట్టు తరఫున మొదటిసారిగా 1995లో థాయిలాండ్‌పై ఆడాడు.
Story first published: Tuesday, November 14, 2017, 10:23 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+