Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ధావన్ సెంచరీ చేశాడా.. అంతే: పాక్‌పై రికార్డ్, సౌతాఫ్రికాకు రివర్స్ (పిక్చర్స్)

మెల్‌బోర్న్: ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం మెల్‌బోర్న్ క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో సఫారీల పైన భారత్ 130 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ప్రపంచకప్ చరిత్రలో ఇప్పటి వరకు నాలుగుసార్లు ఈ జట్లు తలపడ్డాయి. భారత్ మొదటిసారి గెలిచి చరిత్రను తిరగరాసింది.

మొన్నటి ఆదివారం పాకిస్తాన్ పైన గెలిచింది. ఇప్పటి వరకు ప్రపంచకప్ చరిత్రలో భారత్ పైన పాక్ గెలవలేదు. ఆ రికార్డ్‌ను కాపాడుకున్న భారత్, ఇప్పుడు సౌతాఫ్రికాపై గెలిచి ఓటమి రికార్డ్ నుండి బయటపడింది. సౌతాఫ్రికాతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 320 పరుగుల వరకు చేస్తుందని భావించారు.

పాక్‌తో జరిగిన మ్యాచ్‌లోను అందరు అదే ఊహించారు. అయితే, అప్పుడు, ఇప్పుడు శ్లాగ్ ఓవర్లలో భారత్ కుప్పకూలింది. చివరి ఓవర్లలో అయిదారు వికెట్లు కోల్పోయింది. దీంతో మొన్న పాకిస్తాన్ పైన 300, ఇప్పుడు సౌతాఫ్రికాతో 307 పరుగులో చేసింది.

అయితే, భారత బౌలర్లు రెండు మ్యాచులలోను విజృంభించి ప్రత్యర్థులను కట్టడి చేశారు. ఈ రోజు అశ్విన్, షమి, శర్మాలు వికెట్లు బాగా తీశారు. శిఖర్ ధావన్ సెంచరీ చేశాడు. సౌతాఫ్రికా పైన ప్రపంచకప్‌లో సెంచరీ చేసిన రెండో ఆటగాడు ధావన్. గతంలో సచిన్ చేశాడు. ధావన్ 137 పరుగులు చేశాడు. కోహ్లీ 46, రహానే 79 పరుగులు చేశారు.

సెంటిమెంట్ నిజమైంది, ధావన్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్

ఇప్పటి వరకు ధావన్ సెంచరీ చేసిన ప్రతి మ్యాచ్‌లో భారత్ గెలిచింది. ఇప్పుడు కూడా ఆ సెంటిమెంట్ నిజమైంది. కాగా, ధావన్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది. ఈ సందర్భంగా అతను మాట్లాడాడు. తాను నిలదొక్కుకోవాలని భావించానని, నిలదొక్కుకుంటే పరుగులు వాటంతట అవే వస్తాయన్నాడు. తొలి వికెట్ తొందరగా పడిపోవడంతో ఒత్తిడిలో పడిన జట్టును కోహ్లీతో నిలబెట్టే ప్రయత్నం చేశానని చెప్పాడు. రహానేతో ఇన్నింగ్స్ నిర్మించానన్నాడు. ప్రపంచకప్ మొత్తం ఇదే తరహా ప్రదర్శన ఇవ్వాలని కోరుకుంటున్నానని చెప్పాడు. తమను ప్రోత్సహించిన అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు.

భారత్ - సౌతాఫ్రికా మ్యాచ్

భారత్ - సౌతాఫ్రికా మ్యాచ్

ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం మెల్‌బోర్న్ క్రికెట్ స్టేడియంలో భారత్ - సౌతాఫ్రికా మధ్య మ్యాచ్ జరిగింది. సౌతాఫ్రికాపై గెలిచిన ఆనందంలో భారత జట్టు ఆటగాళ్లు.

భారత్ - సౌతాఫ్రికా మ్యాచ్

భారత్ - సౌతాఫ్రికా మ్యాచ్

ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం మెల్‌బోర్న్ క్రికెట్ స్టేడియంలో భారత్ - సౌతాఫ్రికా మధ్య మ్యాచ్ జరిగింది. సౌతాఫ్రికాపై గెలిచిన ఆనందంలో భారత జట్టు ఆటగాళ్లు.

భారత్ - సౌతాఫ్రికా మ్యాచ్

భారత్ - సౌతాఫ్రికా మ్యాచ్

ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం మెల్‌బోర్న్ క్రికెట్ స్టేడియంలో భారత్ - సౌతాఫ్రికా మధ్య మ్యాచ్ జరిగింది. సురేష్ రైనా గ్రేట్ ఫీల్డింగ్.

భారత్ - సౌతాఫ్రికా మ్యాచ్

భారత్ - సౌతాఫ్రికా మ్యాచ్

ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం మెల్‌బోర్న్ క్రికెట్ స్టేడియంలో భారత్ - సౌతాఫ్రికా మధ్య మ్యాచ్ జరిగింది. డికాక్ వికెట్ తీసిన ఆనందంలో భారత జట్టు ప్లేయర్లు.

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+