Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

జిమ్నాస్టిక్స్‌లో చరిత్ర సృష్టించింది: ఎవరీ దీపా కర్మాకర్‌?

న్యూఢిల్లీ: భారతీయ జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ చరిత్ర సృష్టించింది. ఈ ఏడాది బ్రెజిల్‌లో జరిగే రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. దీంతో జిమ్నాస్ట్ విభాగంలో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి భారత మహిళా జిమ్నాస్ట్‌గా దీపా కర్మాకర్‌ రికార్డు నెలకొల్పింది.

త్రిపురలోని అగర్తలకు చెందిన 22 ఏళ్ల దీపా కర్మాకర్ బ్రెజిల్‌లోని రియో డీ జెనీరియోలో ఫైనల్ క్వాలిఫయర్ ఈవెంట్‌లో 52.698 పాయింట్లు సాధించి అద్భుత ప్రతిభను కనబర్చింది. ఈ ఏడాది ఆగస్టులో రియో ఒలింపిక్స్ జరగనున్న సంగతి తెలిసిందే.

కామన్వెల్త్ గేమ్స్‌లో పతకం గెలిచిన తొలి భారత జిమ్నాస్ట్ గా ఆమె ఇదివరకే రికార్డు సృష్టించింది. 2014లో గ్లాస్గోలో జరిగిన కామన్‌ వెల్త్‌ గేమ్స్‌లో ఆమెకు రజతం దక్కింది. దీంతో రజతం సాధించిన తొలి భారతీయ మహిళా జిమ్నాస్ట్‌గా చరిత్ర సృష్టించారు.

Historic feat: Dipa Karmakar becomes 1st Indian woman gymnast to qualify for Olympics

ఆ తర్వాత వరల్డ్ జిమ్నాస్ట్ చాంపియన్ షిప్‌కు కూడా అర్హత సాధించింది. 2015 ప్రపంచ ఆర్టిస్టిక్‌ జిమ్నాస్టిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లోనూ ఆమె అయిదో స్థానంలో నిలిచారు. 52 ఏళ్ల తర్వాత భారత తరుపున ఒలింపిక్స్‌కు ఎంపికైన మహిళా జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ కావడం విశేషం.

భారత్‌కు స్వాతంత్యం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కేవలం 11 మంది మాత్రమే జిమ్నాస్ట్ విభాగంలో ఒలింపిక్స్ బరిలో పోటీ చేశారు. అది కూడా 11 మంది పురుషులు కావడం విశేషం. అంతర్జాతీయ ఫెడరేషన్ ఆఫ్ జిమ్నాస్టిక్స్ కూడా దీపా కర్మాకర్ రియో ఒలింపిక్స్ అర్హత సాధించిన విషయమై ధ్రువీకరించింది.

Story first published: Tuesday, November 14, 2017, 10:23 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+