మహిళా అథ్లెట్ల ఫొటోలతో ఫెమినా మ్యాగజైన్ కవర్ పేజ్

హైదరాబాద్: 2018 సంవత్సరంలో అంతర్జాతీయ వేదికలపై ఆసియా గేమ్స్‌లో, కామన్వెల్త్ గేమ్స్‌లో సత్తా చాటి స్వర్ణ పతకాలు సాధించిన భారత క్రీడాకారిణులకు అరుదైన గౌరవం దక్కింది. ప్రముఖ మ్యాగజైన్ ఫెమినా కవర్‌పేజ్‌పై అథ్లెట్ స్వప్న బర్మన్, రెజ్లర్ వినేష్ ఫోగట్, షూటర్ రాహీ సర్నోబత్, స్ప్రింటర్ హిమదాస్‌ల ఫోటో ఉంచి ప్రచురింది. ఈ ఫొటో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై పలువరు పలు రకాలుగా స్పందిస్తున్నారు.

తొలి భారత అథ్లెట్‌గా స్వప్న బర్మన్
ఇండోనేషియా వేదికగా ముగిసిన 18వ ఆసియా గేమ్స్‌లో హెప్టాథ్లాన్ ఈవెంట్‌లో స్వర్ణం సాధించిన తొలి భారత అథ్లెట్‌గా స్వప్న బర్మన్ చరిత్ర సృష్టించింది. హెప్టాథ్లాన్ అంటే ఏడు ఆటలు కలిపిన ఈవెంట్. రెండు రోజులపాటు జరిగిన ఏడు క్రీడల్లో మొత్తం 6026 (కెరీర్ బెస్ట్) పాయింట్లతో హెప్టాథ్లాన్‌లో విజేతగా నిలిచి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది.

మహిళా రెజ్లర్‌గా వినేశ్ ఫోగట్
గోల్డ్ కోస్ట్ వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ రెజ్లర్లు స్వర్ణ పతకాలను గెలవగా... మహిళల ఫ్రీ స్టయిల్ 50 కేజీల విభాగంలో వినేశ్ పోగట్ స్వర్ణ పతకం సాధించింది. మహిళల 50 కేజీల విభాగంలో వినేశ్ ఫోగట్ కెనడాకు చెందిన జెస్సికా మెక్‌డొనాల్డ్‌ను ఓడించి స్వర్ణం కైవసం చేసుకుంది. తద్వారా కామన్వెల్త్ గేమ్స్‌లో రెండు స్వర్ణాలు సాధించిన ఏకైక మహిళా రెజ్లర్‌గా వినేశ్ ఫోగట్ చరిత్ర సృష్టించింది. 2014లో గ్లాస్కో వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో 48 కేజీలో విభాగంలో స్వర్ణం నెగ్గిన సంగతి తెలిసిందే.

తొలి భారత మహిళా షూటర్‌గా రాహీ సర్నోబత్
మహిళల 25మీటర్ల ఎయిర్‌పిస్టల్ ఈవెంట్‌లో ఈ 27 ఏళ్ల మహారాష్ట్ర షూటర్ స్వర్ణ పతకం సాధించింది. తద్వారా సుదీర్ఘ చరిత్ర కల్గిన ఆసియా గేమ్స్‌లో స్వర్ణం గెలిచిన తొలి భారత మహిళా షూటర్‌గా చరిత్ర సృష్టించింది. ఆసియా గేమ్స్‌లో స్వర్ణం గెలిచిన రాహీ సర్నోబత్‌కి మహారాష్ట్ర ప్రభుత్వం రూ.50లక్షల నజరానాను ప్రకటించింది.

తొలి భారత ట్రాక్ అథ్లెట్‌గా కూడా హిమదాస్
ఫిన్‌లాండ్‌లోని తాంపెరెలో అండర్ 20 అథ్లెటిక్స్ వరల్డ్ చాంపియన్‌షిప్ 400 మీటర్ల ఈవెంట్‌లో హిమదాస్ స్వర్ణ పతకం సాధించిన సంగతి తెలిసిందే. 18 ఏళ్ల హిమ దాస్ 51.46 సెకన్లలో లక్ష్యాన్ని పూర్తి చేసింది. అథ్లెటిక్స్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు స్వర్ణం రావడం ఇదే తొలిసారి. ఈ ఛాంపియన్‌షిప్‌లో పతకం గెలిచిన తొలి భారత ట్రాక్ అథ్లెట్‌గా కూడా హిమ దాస్ చరిత్ర సృష్టించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications