Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భారత్ ఖాతాలో మరో 2 రజితాలు అందించిన హిమదాస్.. అనాస్

Hima Das, Muhammad Anas win silver

జకార్తా: ఇండోనేషియా వేదికగా జరుగుతున్న ఆసియా గేమ్స్‌లో ఆదివారం భారత్‌కి స్ప్రింటర్లు రెండు రజత పతకాలను అందించారు. ఉదయమే ఈక్వెస్ట్రియాన్‌లో రెండు సిల్వర్ మెడల్స్ వచ్చాయి. ఆ తర్వాత బ్యాడ్మింటన్ వుమెన్స్ సింగిల్స్‌లో సెమీస్ చేరి మరో రెండు పతకాలను ఖాయం చేశారు సైనా, సింధు. ఇక ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్‌లో మరో రెండు సిల్వర్ మెడల్స్ తీసుకొచ్చారు హిమ దాస్, మొహమ్మద్ అనాస్. మహిళల 400 మీటర్ల ఈవెంట్‌లో హిమ దాస్ రజత పతకం సాధించింది.

నేషనల్ రికార్డు టైమ్ 50.79 సెకన్లలో రేసు పూర్తి చేసిన ఆమె.. రెండోస్థానంలో నిలిచింది. 51 సెకన్లలోపు 400 మీటర్ల రేసు పూర్తి చేసిన తొలి ఇండియన్‌గా హిమ దాస్ రికార్డు సృష్టించింది. ఇక మరో ఇండియన్ స్ప్రింటర్ నిర్మల 52.96 సెకన్లలో నాలుగోస్థానంతో పెట్టుకుంది. అటు పురుషుల 400 మీటర్ల ఈవెంట్‌లో మొహమ్మద్ అనాస్‌కు సిల్వర్ మెడల్ వచ్చింది. అతడు 45.69 సెకన్ల టైమ్ రికార్డు చేశాడు. మరో ఇండియన్ రాజీవ్ అరోకియా 45.84 సెకన్లతో నాలుగోస్థానంలో నిలిచాడు.

బహ్రెయిన్‌కు చెందిన అబ్దలేలా హసన్ గోల్డ్ మెడల్ గెలిచాడు. ప్రస్తుతం ఇండియా ఖాతాలో మొత్తం 35 మెడల్స్ ఉన్నాయి. ఆదివారం ఒక్కరోజే 4 సిల్వర్ మెడల్స్ రావడం విశేషం. 7 గోల్డ్, 9 సిల్వర్, 19 బ్రాంజ్ మెడల్స్ భారత్ ఖాతాలో ఉన్నాయి.

టోర్నీలో 8వ రోజైన ఆదివారం స్ప్రింటర్లు జోరు పెంచడంతో భారత్ పతకాల సంఖ్య 36కి చేరింది. ఇందులో 7 స్వర్ణాలు ఉండగా.. 9 రజతాలు, 20 కాంస్య పతకాలు ఉన్నాయి. మొత్తంగా పతకాల పట్టికలో భారత్ 9వ స్థానంలో కొనసాగుతోంది. ఈ జాబితాలో మొత్తం 167 పతకాలతో చైనా అగ్రస్థానంలో ఉండగా.. తర్వాత వరుసగా జపాన్ (118), దక్షిణ కొరియా (92), ఇరాన్ (39), ఇండోనేషియా (48) టాప్-5లో కొనసాగుతున్నాయి. బంగారు పతకాల సంఖ్య ఆధారంగా ఈ జాబితాని రూపొందించారు.

Story first published: Sunday, August 26, 2018, 19:35 [IST]
Other articles published on Aug 26, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+