న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హీరో విజయ్ దేవరకొండ సాయం.. గోల్డ్ మెడల్ కొట్టిన యువ బాక్సర్!!

Hero Vijay Deverkonda helped to Kick Boxing player Ganesh Embari

హైదరాబాద్: టాలీవుడ్ 'రౌడీ' హీరో విజయ్ దేవరకొండ. వరుస సినిమాలతో అనతికాలంలోనే టాలీవుడ్ సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించారు. తనకు హీరోగా అవకాశం ఇచ్చిన డైరెక్టర్ 'తరుణ్ భాస్కర్' లాగే.. విజయ్ కూడా ఎంతో మంది యువ టాలెంట్‌కు ప్రోత్సాహం అందిస్తున్నారు. ఇక విజయ్ స్థాపించిన 'దేవరకొండ ఫౌండేషన్' ద్వారా పలువురికి ఆర్థిక సహాయం కూడా చేస్తున్నారు. ఈ క్రమంలో దేవరకొండ ఫౌండేషన్ చేసిన చిన్న ఆర్థిక సహాయం ఓ యువ క్రీడాకారుడి కెరీర్‌కు దోహదపడింది.

మద్యం తాగితే ఆమె విపరీతంగా కొట్టేది.. సంచలన విషయాలు బయటపెట్టిన వార్నర్!!మద్యం తాగితే ఆమె విపరీతంగా కొట్టేది.. సంచలన విషయాలు బయటపెట్టిన వార్నర్!!

విషయంలోకి వెళితే... మెదక్ జిల్లాకు చెందిన ప్రతిభావంతుడైన కిక్ బాక్సర్ గణేష్ ఎంబారీ. అద్భుత నైపుణ్యం ఉన్న గణేష్.. పేదరికంతో బాధపడుతున్నాడు. న్యూఢిల్లీలో జరుగుతున్న అంతర్జాతీయ కిక్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్‌కి వెళ్ళడానికి గణేష్ దగ్గర డబ్బులు లేవు. ఈ విషయం అభిమానుల ద్వారా తెలుసుకొన్న విజయ్.. తన ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సహాయం అందించారు.

దేవరకొండ ఫౌండేషన్‌ నుంచి ఫిబ్రవరి 1వ తేదీన రూ.24 వేలు ఆర్థిక సహాయం అందుకొన్న గణేష్ ఎంబారీ.. ఫిబ్రవరి 13న న్యూఢిల్లీలో జరిగిన క్రీడా పోటీలో సత్తాచాటాడు. గణేష్ తన అద్భుత ప్రదర్శనతో అంతర్జాతీయ కిక్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్‌లో ఏకంగా బంగారు పతకం సాధించాడు. దాంతో యువ క్రీడాకారుడు గణేష్‌ను విజయ్ దేవరకొండ తండ్రి గోవర్ధన్ రావు అభినందించారు.

పతకం సాధించిన గణేష్ ఎంబారి సంతోషం వ్యక్తం చేసాడు. తాజాగా గణేష్ మాట్లాడుతూ... 'యువ టాలెంట్‌ను ఎప్పుడూ ప్రోత్సహించే విజయ్ దేవరకొండ సర్ వల్లే అంతర్జాతీయ క్రీడా పోటీలో రాణించాను. విజయ్ సర్ సహాయం అందించడం వల్లే ఢిల్లీకి వెళ్లా, గోల్డ్ మెడల్ సాధించాను' అని గణేష్ ఎంబారీ తెలిపాడు.

పెళ్లి చూపులు, అర్జున్‌ రెడ్డి, గీతా గోవిందం లాంటి ప్రేమ కథలతో యువతరం ఆరాధ్య కథానాయకుడిగా పేరుతెచ్చుకున్నారు విజయ్‌ దేవరకొండ. సహజత్వం వైవిధ్యత మేళవించిన ఈ ప్రేమకథా చిత్రాలు నటుడిగా ఆయన్ని కొత్త కోణంలో ఆవిష్కరించాయి. ఇక తాజాగా 'వరల్డ్‌ఫేమస్‌ లవర్‌'తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రొటీన్‌ సినిమాలకు అలవాటుపడిన తెలుగు ప్రేక్షకులకు సరికొత్త సినిమాటిక్‌ ఎక్స్‌పీరియన్స్‌ను వరల్డ్‌ఫేమస్‌ లవర్‌ అందించింది.

Story first published: Saturday, February 15, 2020, 18:39 [IST]
Other articles published on Feb 15, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X