For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫ్యాన్స్‌కు సదావకాశం: సంతకంతో కూడిన భారత జట్టు జెర్సీలను గెలుచుకునే ఛాన్స్

By Nageswara Rao

న్యూఢిల్లీ: క్రికెట్ అభిమానులకు శుభవార్త. మాజీ కెప్టెన్ కపిల్ దేవ్, ఇతర ఆటగాళ్ల సంతకాలతో కూడిన టీమిండియా జట్టు సభ్యుల జెర్సీలను అభిమానులు గెలుచుకునే అవకాశం కల్పించారు. #WinIndiaJersey అనే కార్యక్రమం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఐదుగురు లక్కీ విన్నర్స్‌ను ఎంపిక చేసి, సంతకాలతో కూడిన జెర్సీలను విజేతలకు అందజేస్తారు.

ఈ కార్యక్రమాన్ని స్పోర్ట్ స్టార్ జతిన్ ప్రభు Frankly.me ప్లాట్ ఫామ్ ద్వారా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో 1983 వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ కపిల్ దేవ్‌తో పాటుగా వీవీఎస్ లక్ష్మణ్, మురళీ కార్తిక్, పాకిస్ధాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ పాల్గొనున్నారు.

#WinIndiaJersey అనే కార్యక్రమం ద్వారా క్రికెట్ అభిమానులు టీమిండియా జెర్సీలను గెలుచుకునే సదావకాశాన్ని కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని కొత్తగా విడుదల చేసిన ఆండ్రాయిడ్/ఐఓఎస్ యాప్ Frankly.me ద్వారా నిర్వహిస్తున్నారు.

Here is your chance to win autographed Team India World Cup jerseys

ఈ యాప్ ద్వారా క్రికెట్ అభిమానులు వారు ఆరాధించే ఆటగాడి యొక్క విశేషాలతో పాటు, సెలబ్రిటీల నుంచి వీడియో సెల్ఫీ సమాధానాలను పొందగలుగుతారు. మీరు అడిగిన ప్రశ్న గనుక ఐసీసీ వరల్డ్ కప్ 2015 ముగిసే వరకు యాప్ టాప్ స్ధానంలో ఉంటే మీరు జెర్సీ పొందేందుకు అర్హులు.

ఈ యాప్ అద్భుతంగా ఉండటంతో ట్విట్టర్‌కు బదులు స్టార్ స్పోర్ట్స్ అధినేత జతిన్ ప్రభు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇక Frankly.me యాప్ విషయానికి వస్తే వీడియో సెల్పీలు, నిజ సమయ కవరేజితో రెండు వైపులా సమాచార మార్పిడికి ఉపయోగపడుతుందన్నారు.

క్రికెట్ అభిమానులకు అలరించేందుకు అంగీకరించిన క్రికెట్ లెజెండ్‌లకు తన తరుపునుంచి ధన్యవాదాలు తెలిపారు. ఇక ఆస్టేలియా-న్యూజిలాండ్‌లో ప్రస్తుతం జరుగుతున్న ఐసీసీ వరల్డ్ కప్‌కు స్టార్ స్పోర్ట్స్ ప్రజెంట్ చేస్తున్న విషయం తెలిసిందే.

Story first published: Tuesday, November 14, 2017, 10:23 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+