Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కామన్వెల్త్‌లో డబుల్: ఇప్పుడు టార్గెట్ వరల్డ్ కప్ అంటోన్న హీనా

Heena Sidhu targets World Cup glory after Commonwealth Games double

హైదరాబాద్: ఇటీవల గోల్డ్ కోస్ వేదికగా ముగిసిన కామన్వెల్త్ గేమ్స్ షూటింగ్‌లో స్వర్ణం, రజతం గెలిచిన హీనా సిద్ధూ తదుపరి టోర్నీపై దృష్టి సారించింది. మే 22 నుంచి 29 వరకు మునిచ్‌లో జరగనున్న ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ వరల్డ్ కప్‌పైనా ఆశావహంగా ఉన్నట్లు తెలిపింది.

28 ఏళ్ల హీనా సిద్ధూ గోల్డ్‌కోస్ట్‌ వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో 25 మీటర్ల స్పోర్ట్స్‌ పిస్టల్‌ విభాగంలో స్వర్ణం నెగ్గి సరికొత్త రికార్డుని సృష్టించగా, 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో సిల్వర్ పతకం నెగ్గిన సంగతి తెలిసిందే.

తాజాగా ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ వరల్డ్ కప్ టోర్నీ కోసం జర్మనీకి బయల్దేరే ముందు మీడియాతో మాట్లాడిన హీనా తాను మరింత నిలకడ సాధించాల్సి ఉందని పేర్కొంది. 'మే 8 నుంచి 21 వరకు నేను ఫోర్జహిమ్‌లో ట్రైనింగ్ తీసుకుంటా. మే 13న ప్రాక్టీస్ మ్యాచ్‌లో పాల్గొంటా. ఈ నెల చివర్లో వరల్డ్ కప్‌లో పాల్గొంటా' అని తెలిపింది.

అంతేకాదు ప్రస్తుతం మారిన షూటింగ్‌ షెడ్యూల్‌ దృష్ట్యా తన దృష్టంతా నిలకడ కొనసాగించడంపైనే అని హీనా వెల్లడించింది. ఆగస్టు, సెప్టెంబరులో జరిగే ఆసియా క్రీడలు, ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో అగ్రస్థానంలో నిలవడమే తన ధ్యేయమని పేర్కొంది. తన కెరీర్‌‌ని తొలుత 10 మీటర్ల పిస్టల్ షూటింగ్‌తో ప్రారంభించిన హీనా ఆ తర్వాత 2017లో 25 మీటర్ల పిస్టల్ షూటింగ్‌‌లో కూడా ప్రాక్టీస్ చేయడం ప్రారంభించింది.

Story first published: Tuesday, May 8, 2018, 15:46 [IST]
Other articles published on May 8, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+