హైదరాబాద్: భారత్ షూటర్ హీనా సిధ్ధు మరోసారి సత్తా చాటింది. బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న కామన్‌వెల్త్ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో హీనా స్వర్ణం సాధించింది. టోర్నీలో భాగంగా మంగళవారం నిర్వహించిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో హీనా సంయుక్తంగా 626.2 (386+240.8) పాయింట్లతో అగ్రస్ధానంలో నిలిచింది.
ఇక, ఆస్ట్రేలియాకు చెందిన ఎలీనా (238.2), క్రిస్టీ గిల్మన్(213.7) రెండు మూడు స్ధానాల్లో నిలిచి రజత, కాంస్య పతకాలను సొంతం చేసుకున్నారు. ఇక, పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో భారత్‌కు చెందిన దీపక్ కుమార్ కాంస్యం సాధించాడు.

ఇదే ఈవెంట్‌లో లండన్ ఒలింపిక్ కాంస్య పతక విజేత గగన్ నారంగ్ నాలుగో స్ధానంలో నిలిచాడు. క్వాలిఫికేషన్‌లో గగన్ నారంగ్ 626.6 పాయింట్లు సాధించి కామన్‌వెల్త్ టోర్నీలో రికార్డు నమోదు చేశాడు. ఇదిలా ఉంటే ఇటీవల ఢిల్లీలో జరిగిన ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచకప్ ఫైనల్లో జీతూరాయ్‌తో కలిసి మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో హీనా స్వర్ణం గెలిచిన సంగతి తెలిసిందే.