హెచ్ సిఎలో మరోసారి చిచ్చు: కార్యదర్శి చలపతికి కష్టాలు

ఇటీవల భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య టెస్టు మ్యాచ్ సందర్భంగా అనుబంధ క్లబ్‌ల కార్యదర్శులకు బ్లేజర్లు ఇవ్వాలని హెచ్‌సీఏ నిర్ణయించింది. బ్లేజర్లు తీసుకోవాల్సిందిగా క్లబ్ ల ప్రతినిధులకు లేఖలు పంపింది. ఈ లేఖ ఏపీ టెలికాం (బీఎస్‌ఎన్‌ఎల్) క్రీడల అధికారికి అందింది. టెలిఫోన్, టెలికాం జట్ల తరఫున తమ నామినీకి బ్లేజర్లు ఇవ్వాల్సిందిగా ఆయన హెచ్‌సీఏకు సమాధానం రాశారు. దాంతోపాటు ఎవరి అనుమతితో టెలిఫోన్, టెలికాం జట్ల చిరునామాలు మార్చారో చెప్పాలని హెచ్‌సీఏను కోరారు. ఈ రెండు లేఖలకు బదులే చలపతి రాసిన ఉత్తరం. సదరు రెండు జట్లతో ఏపీ టెలికాంకు ఎలాంటి సంబంధం లేదని ఆ లేఖలో చలపతి స్పష్టం చేశారు.
నిజానికి టెలిఫోన్, టెలికాం రెండూ బీఎస్‌ఎన్‌ఎల్ సంస్థలే. గతంలో ఈ రెండూ విడివిడిగా ఉండేవి. విలీనంలో భాగంగా ఈ రెండూ కలిసి బీఎస్‌ఎన్‌ఎల్‌గా మారాయి. ఐతే ఈ రెండు సంస్థలకు ప్రతినిధులుగా వ్యవహరించిన కొందరు అనంతర కాలంలో వీటిని ప్రైవేటు క్లబ్‌లుగా నడిపించారు. సొంత చిరునామాలు పెట్టి బీఎస్ ఎన్ ఎల్ కు ఎలాంటి సమాచారం లేకుండా చేశారు. చాలా ఏళ్ళుగా ఈ తతంగం నడుస్తున్నా బ్లేజర్ల లేఖ బీఎస్‌ఎన్‌ఎల్ అధికారికి అందడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications