Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బ్లాక్ లో మూడో వన్డే టికెట్లు అమ్ముతున్నట్టు ఆరోపణలు?


హైదరాబాద్: భారత్,అస్ట్రేలియా క్రికెట్ జట్ల మధ్య అక్టోబర్ 5న జరగనున్న వన్డే క్రికెట్ మ్యాచ్ టికెట్లు బ్లాక్ లో అమ్మారని అందుకే తమకు టికెట్లు దొరకలేదని అభిమానుల నుంచి వస్తున్న ఆరోపణలను హైదరాబాద్ క్రికెట్ సంఘం(హెచ్.సి.ఎ)ఖండించింది. అయితే మ్యాచ్ టికెట్లను హెచ్.సి.ఎ బ్లాక్ లో అమ్ముకుంటోందని టికెట్ల కోసం కిలోమీటర్లు బారులు తీరిన అభిమానులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. తాము గంటల కొద్ది ఆశతో క్యూలో నిలబడితే నాలుగు గంటల్లోనే టికెట్లు అయిపోవడమేమిటని వారు తీవ్ర పదాజాలంతో హెచ్.సి.ఎ పై మండి పడుతున్నారు.

కాగా టికెట్లను బ్లాక్ లో అమ్ముకోవాల్సిన అవసరం తమకు లేదని హెచ్.సి.ఎ అధ్యక్షుడు, రాష్ట్ర మంత్రి జి.వినోద్ అన్నారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ దేశంలోనే హెచ్.సి.ఎ ధనవంతమైన క్రికెట్ సంఘం అని, అలాంటి తమకు బ్లాక్ లో టికెట్లు అమ్ముకోవాల్సిన పని లేదని అన్నారు. మూడో వన్డేకు హైదరాబాద్ ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియం వేదిక కానున్నది.
Story first published: Wednesday, October 3, 2007, 23:53 [IST]
Other articles published on Oct 3, 2007
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+