హైదరాబాద్: మహిళా క్రికెటర్లపై లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో ఆంధ్రా క్రికెట్ ఆసోసియేషన్ (ఎసిఎ) మాజీ కార్యదర్శి చాముండేశ్వరీ నాథ్ కు తాత్కాలిక ఊరట లభించింది. ఈ నెల 20వ తేదీ వరకు ఆయనపై ఎటువంటి చర్యలూ చేపట్టవద్దని హైకోర్టు గురువారం ఆదేశించింది. కేసు విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది. ఐపియస్ సెక్షన్ 354 కింద నమోదు చేసిన కేసులో తదుపరి చర్యలను అన్నింటినీ నిలుపుదల చేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
చాముండేశ్వరీనాథ్ మహిళా క్రికెటర్లను లైంగిక వేధించారని తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కుంటున్న విషయం తెలిసిందే. తమను చాముండేశ్వరీనాథ్ లైంగికంగా వేధించారని కొంత మంది మహిళా క్రికెటర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు కూడా.