కామన్వెల్త్ క్రీడాకారులకు హెచ్చరిక: అభినందన సభకు రాకుంటే ప్రైజ్‌లు వెనక్కేనట!

హైదరాబాద్: కొద్ది రోజుల క్రితమే ముగిసిన గోల్డ్ కోస్ట్ వేడుకలలో పతకాలు సాధించి స్వదేశానికి వచ్చిన అథ్లెట్లకు హెచ్చరికలు జారీ అవుతున్నాయి. హర్యానా ప్రభుత్వం ఆ రాష్ట్రానికి చెందిన పలువురు క్రీడాకారులను అభినందన సభకు రావాలంటూ పిలుపునిచ్చింది. ఒకవేళ వాళ్లెవరూ అభినందన కార్యక్రమానికి రాలేని పక్షంలో వాళ్లకు వచ్చిన బహుమతులను వెనక్కి పంపించేస్తాం అని పేర్కొంది.
వివరాల్లోకి వెళితే.. కొద్ది రోజుల ముందు ముగిసిన గోల్డ్ కోస్ట్ వేడుకలలో విజేతలకు హర్యానా రాష్ట్ర ప్రభుత్వం పతకాల వారీగా క్యాష్ రివార్డులను ప్రకటించింది. స్వర్ణ విజేతలకు రూ.1.5కోట్లు, రజిత విజేతలకు రూ.75 లక్షలు, కాంస్య విజేతలకు రూ. 50లక్షలు అని ప్రకటించింది. ఈ నిర్ణయం వెలువడ్డ అనంతరం పతకదారులందరూ ఆ కార్యక్రమానికి వెళ్లకపోవడమే నయమంటూ అభిప్రాయపడ్డారు. కార్యక్రమానికి హాజరవడానికి నిరాకరించడంతో.. హర్యానా రాష్ట్ర క్రీడా మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరతై కార్యక్రమానికి ఎగ్గొట్టాలని ప్రయత్నిస్తున్నారో వారికి రివార్డు వెనక్కి తీసుకుంటామని తెలిపారు.
ఈ ఘటనపై క్రీడాకారులలో ఒకరైన వినేశ్ ఇలా స్పందించారు. మేము పతకాలను గెలుచుకున్నప్పుడు గొప్పగా భావించాం. కానీ, ఏదైతే రాష్ట్ర పభుత్వం పతకాల వారీగా నగదు బహుమతి ప్రకటిస్తుందో అది మాకు నచ్చలేదు. అందుకే అందరం కలిసి కార్యక్రమానికి హాజరుకాకూడదని నిర్ణయించుకున్నాం.' అని చెప్పుకొచ్చాడు.
హర్యానా క్రీడల, యవజన కార్య వ్యవహారాల శాఖ మంత్రి అనిల్ మాట్లాడుతూ.. ఎవరైతే కార్యక్రమానికి హాజరు కాకుండా ఉంటారో.. వారి నగదు బహుమతి వారు పని చేస్తున్న సంస్థలకు వెళ్లిపోతుంది. ఇలా బాయ్‌కాట్ చేయడమనే పద్ధతి క్రీడాకారుల హక్కేం కాదు. దాదాపు పతకాలను గెలచుకున్న 22 మందిలో 13మంది కేంద్ర ప్రభుత్వం నుంచి ఉద్యోగం పొందిన వారే ఉన్నారు.' అని వివరించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications