
హైదరాబాద్: 2017 సంవత్సరంలో స్టార్ ప్లేయర్లు ఎక్కువ మంది ఇంట పెళ్లి బాజాలు మోగాయి. విరాట్ కోహ్లీ, కృనాల్ పాండ్యా, సునీల్ చెత్రి తదితర స్టార్ ప్లేయర్లు అంతా ఒకింటివాళ్లయ్యారు. అయితే ఈ ఏడాది భారత చెస్ స్టార్, గ్రాండ్‌మాస్టర్ హరికృష్ణ పెళ్లికి సిద్ధమయ్యాడు.
ఒకే రంగానికి చెందిన ప్రేయసిని పెళ్లాడనున్నాడు. సెర్బియా చెస్ క్రీడాకారిణి నదెడ్జాను మార్చి 3న హైదరాబాద్‌లోని నోవాటెల్‌లో వివాహమాడనున్నట్లు ఇప్పటికే వెల్లడైన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ పెళ్లి ఆహ్వాన వీడియోను హరి మీడియాకు విడుదల చేశాడు. హరికి కాబోయే భార్య ఫొటో కూడా ఇందులో ఉంది.
వారిద్దరూ జూనియర్ టోర్నమెంట్ స్థాయి నుంచే పరిచయస్థులు. వారి స్నేహమే క్రమేపి ప్రేమగా మారింది. వారి వివాహం గురించి హరికృష్ణ తండ్రి మీడియాకు వివరించాడు. భారత దేశానికి సంబంధించి స్లార్ క్రీడాకారుడైన విశ్వనాథన్ ఆనంద్ తర్వాత యువ గ్రాండ్ మాస్టర్‌గా హరికృష్ణ ఎదుగుతున్నాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.