For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జెనీవా ఫిడే గ్రాండ్‌ ప్రీ: హరికృష్ణ సంచలన విజయం

స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో జరుగుతున్న జెనీవా ఫిడే గ్రాండ్‌ ప్రీ అంతర్జాతీయ చెస్‌ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌ మాస్టర్‌ హరికృష్ణ సంచలనం సృష్టించాడు.

By Nageshwara Rao

హైదరాబాద్: స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో జరుగుతున్న జెనీవా ఫిడే గ్రాండ్‌ ప్రీ అంతర్జాతీయ చెస్‌ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌ మాస్టర్‌ హరికృష్ణ సంచలనం సృష్టించాడు. బుధవారం జరిగిన ఆరో రౌండ్‌లో హరికృష్ణ 38 ఎత్తుల్లో ప్రపంచ నాలుగో ర్యాంకర్‌ లెవాన్‌ అరోనియన్‌ (అర్మేనియా)ను ఓడించాడు.

ఈ చెస్ ఈ టోర్నీలో హరికృష్ణకు ఇది రెండో విజయం కావడం విశేషం. ఆరో రౌండ్‌ తర్వాత హరికృష్ణ నాలుగు పాయింట్లతో మరో ఇద్దరితో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. హరికృష్ట అంతర్జాతీయ చెస్ ర్యాంకుల్లో 22వ ర్యాంకులో కొనసాగుతున్నాడు.

 Harikrishna defeats World No 4 Aronian; grabs top spot

ఆరో రౌండ్‌ చివర్లో హరికృష్ణ అనూహ్యంగా పుంజుకోవడంతో రెండు విజయాలు, నాలుగు డ్రాలు అతడి ఖాతాలో చేరాయి. గుంటూరుకు చెందిన హరికృష్ణ ఏడో రౌండ్‌లో రష్యాకు చెందిన అలెగ్జాండర్ గ్రిస్చుక్‌తో తలపడనున్నాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:23 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+