ప్రపంచ టైటిలే లక్ష్యం: సన్మాన సభలో గ్రాండ్ మాస్టర్ (ఫోటోలు)
హైదరాబాద్: ప్రపంచ ఛాంపియన్ బాలికల అండర్ - 14, అండర్ - 18లో విజేతగా నిలవడం ద్వారా వెలుగులోకి వచ్చిన తెలుగు తేజం ద్రోణవల్లి హారిక. అంతర్జాతీయ చెస్‌లో అనేక విజయాలతో ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచింది. ఇటీవల చైనాలో జరిగిన ప్రపంచ మహిళల చెస్ ఛాంపియన్ షిప్‌లో కాంస్య పతకం గెలిచిన నేపథ్యంలో మంగళవారం ఆమె విలేకర్లతో మాట్లాడింది.
ప్రపంచ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలవడమే తన లక్ష్యమని ప్రకటించింది. "ఈసారి కాంస్యంతో సరిపెట్టుకున్నందుకు బాధగానే ఉంది. అంతకు ముందు తీరికలేని షెడ్యూళ్లతో బాగా అలసిపోవడమే సెమీస్‌లో టైబ్రేక్‌లో నా ఓటమికి కారణం. అయితే పరాజయాలు ఆటలో భాగమే. వీటి నుంచి నేర్చుకుని మరింతగా రాణించడానికి కృషి చేస్తా" అని హారిక అన్నారు.

ప్రపంచ టైటిలే లక్ష్యం: గ్రాండ్ మాస్టర్ ద్రోణవల్లి హారిక
తల్లిదండ్రులు, కోచ్, స్పాన్సర్‌ల ప్రోత్సాహంతోనే ఈ స్దాయికి ఎదిగానని ఆమె అన్నారు. ర్యాంకుల కోసం ఆడనని, ఆట ఎంత సంతృప్తినిచ్చిందన్నదే నాకు ముఖ్యమని చెప్పారు.

ప్రపంచ టైటిలే లక్ష్యం: గ్రాండ్ మాస్టర్ ద్రోణవల్లి హారిక
మహిళల విబాగంలో ప్రపంచ 14వ ర్యాంకు వరకు వెళ్లానని, 2004లో ప్రపంచ యూత్ చెస్ ఛాంపినయ్ షిప్ అండర్-14 విభాగంలో టైటిల్ గెలవడం మరిచిపోలేని అనుభూతని ఆమె పేర్కొన్నారు.

ప్రపంచ టైటిలే లక్ష్యం: గ్రాండ్ మాస్టర్ ద్రోణవల్లి హారిక
గతనెల రష్యాలో జరిగిన ప్రపంచ మహిళల చెస్ చాంపియన్‌షిప్‌లో మూడోస్థానంతో కాంస్యం పతకం సాధించి సత్తాచాటిన ఈ తెలుగమ్మాయిని లక్ష్య, సహ్యాద్రి సంస్థలు హైదరాబాద్‌లో మంగళవారం ఘనంగా సన్మానించారు.

ప్రపంచ టైటిలే లక్ష్యం: గ్రాండ్ మాస్టర్ ద్రోణవల్లి హారిక
ద్రోణవల్లి హారిక గుంటూరు జిల్లాలో జన్మించినా, హైదరాబాద్‌లోనే పెరిగింది. చెస్‌కు రాష్ట్ర ప్రభుత్వాలు చేయూతనివ్వాలని కోరింది. చాలా మంది ప్రతిభావంతులు టోర్నీల్లో పాల్గొనలేకపోతున్నారని అన్నారు. అలాంటి వారికి ప్రభుత్వం అండదండలు తప్పనిసరిగా ఉండాలన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications