హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కు చెందిన చెస్ క్రీడాకారిణి ద్రోణవల్లి హారిక అర్జున్ అవార్డుకు ఎంపికైంది. కామన్ వెల్త్ క్రీడల్లో రెండు సార్లు విజయం సాధించిన ఆమె ఈ అవార్డుకు ఎంపికైంది. మిల్కాసింగ్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ అవార్డు విజేతలను ఎంపిక చేసింది. రాష్ట్రానికే చెందిన వాలీబాల్ కోచ్ శ్రీధరన్ ద్రోణాచార్య అవార్డుకు ఎంపికయ్యారు.
ఈ నెల 29వ తేదీన హారిక రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకుంటారు. క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ ఖేల్ రత్న అవార్డుకు ఎంపికైన విషయం తెలిసిందే. ఖేల్ రత్న అవార్డు పొందిన రెండో క్రికెటర్ ధోనీ. తనకు అవార్డు రాగానే ధోనీ ఆలయానికి వెళ్లి పూజలు చేశారు.