Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పాండ్యా సిక్స్‌లతో ఊపేశాడు: చెన్నైని 'సూపర్‌'గా ముంచేశాడు

చెన్నై: ఓ కుర్రాడు మ్యాచ్ ఫలితాన్నే మార్చేశాడు. వరుసగా సిక్స్‌లు బాది 8 బంతుల్లో 25 పరుగులు చేసి ఓటమి ఎరుగునే ధోనీ సేనను ముంచేశాడు. ముంబై ఇండియన్స్‌కు విజయాన్ని సాధించి పెట్టాడు. చెన్నై నిర్దేశించిన లక్ష్యం 159 పరుగు లక్ష్యం పెద్దది కాకపోయినప్పటికీ, ఓపెనర్లు పార్థివ్ పటేల్-సిమన్స్ తొలి వికెట్‌కు 10 ఓవర్లలో 84 పరుగులు జోడించి శుభారంభాన్నిచ్చినప్పటికీ ఆ తర్వాత ముంబై కష్టాల్లో పడింది.

అంత శుభారాంభాన్ని ఇచ్చినప్పటికీ 12 బంతుల్లో విజయానికి 30 పరుగులు చేయాల్సినంతగా ముంబై కష్టాల్లో పడింది. అప్పటికే పొలార్డ్, రోహిత్ పెవిలియన్‌కు చేరిపోయారు. ముంబై గెలుపు అసాధ్యమనిపించింది. అయితే గుజరాత్‌కు చెందిన 21 ఏళ్ల హార్దిక్ హిమాంశు పాండ్య ఇక్కడే మ్యాజిక్ చేశాడు. 19వ ఓవర్లో పాండ్య మూడు సిక్సర్లు కొట్టి ఏకంగా 21 పరుగులు పిండుకొని మ్యాచ్‌ను చెన్నై నుంచి ముంబైకి లాగిపోరేశాడు.

Ambati Rayudu

సొంత గడ్డపై తొలిసారిగా చెన్నై పరాజయం పాలైంది. పార్థివ్ పటేల్ (45; 6 ఫోర్లు), సిమన్స్ (38; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు)లు శుభారంభాన్నివ్వడంతో బాటు అంబటి రాయుడు (34 నాటౌట్; 19 బంతుల్లో ఒక ఫోర్, 3 సిక్స్‌లు), హార్దిక్ పాండ్య (21 నాటౌట్; 8 బంతుల్లో 3 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై విసిరిన 159 పరుగుల లక్ష్యాన్ని ముంబై 4 వికెట్లు కోల్పోయి 19.2 ఓవర్లలోనే ఛేదించింది.

చివరికి 17 బంతుల్లో 34 పరుగులు అవసరమైన దశలో రాయుడు-హార్దిక్ జోడీ భారీషాట్లతో విరుచుకుపడుతూ కేవలం 13 బంతుల్లోనే మ్యాచ్‌ను విజయంతో ముగించారు. బ్యాట్‌తో రాణించడంతో పాటు అంతకు ముందు మూడు క్యాచ్‌లు పట్టి ఫీల్డ్‌లో రాణించిన పాండ్యకే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

మెకల్లమ్ ధనాధన్ బ్యాటింగ్‌తో చెన్నై 4.4 ఓవర్లలోనే 44 పరుగులుచేసింది. అయితే మరుసటి బంతికే మెకల్లమ్ ఔట్ కావడం, తర్వాత రైనా (10), స్మిత్ (27)లను రెండు బంతుల తేడాతో నష్టపోవడంతో చెన్నై జోరుకు బ్రేకులు పడ్డాయి. 10 ఓవర్లలో చెన్నై స్కోరు 67/3. అప్పటికే చెన్నైకి కళ్లెం వేసిన సుచిత్‌కు తోడు మిగతా బౌలర్లు మరింత కట్టుదిట్టంగా బంతులేయడంతో ధోనీ, డుప్లెసిస్ జోడీ క్రీజులో ఉన్నా కూడా చెన్నై 16వ ఓవర్లోగానీ వంద పరుగులకు చేరుకోలేకపోయింది.

అయితే మార్చెంట్ డి లాంగె వేసిన 17వ ఓవర్లో నేగీ 3 ఫోర్లు కొట్టడం, అతనికి ధోనీ తోడవ్వడంతో చెన్నై 160 మార్కు దరిదాపుల్లోకి చేరగలిగింది. ఏమైతేనేం, చివరకు చెన్నై ఓటమి పాలు కాక తప్పలేదు. ఈ విజయంతో ముంబై ఇండియన్స్ 14 పాయింట్లతో నాలుగో స్థానానికి ఎగబాకింది.

Story first published: Tuesday, November 14, 2017, 10:23 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+