చండీగఢ్: వన్డేల్లోకి తిరిగి అడుగు పెట్టిన నేపథ్యంలో, తాను టెస్టుల్లోకి కూడా ఆరంగేట్రం చేస్తానని స్పిన్నర్ హర్భజన్ సింగ్ ధీమా వ్యక్తం చేస్తున్నాడు. మళ్లీ టెస్ట్ మ్యాచ్‌లు ఆడతానని అతను శుక్రవారం నాడు ఆశాభావం వ్యక్తం చేశాడు.
దక్షిణాఫ్రికాతో చివరి వన్డేలో రాణించానని, భవిష్యత్‌లో టెస్ట్ జట్టులోకి వస్తాననే నమ్మకం ఉందని చెప్పాడు. తన దృష్టిలో దూకుడు అంటే ఎవరినో ఒకరిని కొట్టడం కాదన్నాడు. బంతి, బ్యాట్‌తో సమాధానం చెప్పడమే అన్నాడు. సుదీర్ఘ కాలం భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించడం వల్ల నేను ఇదే నేర్చుకున్నానని చెప్పాడు.

నేను నేర్చుకున్న దాన్ని యువ క్రికెటర్లకు నేర్పించాలని అనుకుంటున్నానని చెప్పాడు. అందుకే అకాడమీలు నడుపుతున్నానని తెలిపాడు. కాగా, హర్భజన్ సింగ్‌కు దేశవ్యాప్తంగా ఐదు వరకు అకాడమీలు ఉన్నాయి. చాలా రోజుల తర్వాత వన్డేలకు ఆరంగేట్రం చేసిన విషయం తెలిసిందే.