Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నాలుగోసారి: ఎఫ్1 విజేతగా హామిల్టన్

హైదరాబాద్: మెర్సిడెస్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ ఫార్ములా వన్ ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి మెక్సికన్ గ్రాండ్ ప్రీలో భాగంగా మెక్సికో ఫార్ములా వన్ రేసులో హామిల్టన్ తొమ్మిదో స్థానంతో టాప్‌టెన్‌లో నిలిచాడు.

దీంతో మొత్తంగా 333 పాయింట్లను హామిల్టన్ తన ఖాతాలో వేసుకున్నాడు. డ్రైవర్స్ ఛాంపియన్‌షిప్‌లో అగ్రస్థానంలో నిలిచి విశ్వవిజేతగా నిలిచాడు. ఫార్ములా వన్ వరల్డ్ ఛాంపియన్‌గా నిలవడం హామిల్టన్‌కిది నాలుగోసారి.

Hamilton wins fourth title despite finishing ninth

బ్రిటన్‌కు చెందిన లూయిస్ హామిల్టన్ 2008లో తొలిసారి వరల్డ్ టైటిల్ నెగ్గాడు. ఆ తర్వాత 2014, 15లో వరల్డ్ ఛాంపియన్‌గా అవతరించాడు. ఆదివారం రాత్రి జరిగిన మెక్సికో గ్రాండ్ ప్రీలో మ్యాక్స్ వెర్సాపెన్ టైటిల్ విజేతగా నిలిచాడు.

ఈ సీజన్‌లో మ్యాక్స్‌కిది రెండో టైటిల్ కావడం విశేషం. వరల్డ్ చాంపియన్‌షిప్ రేసులో ఇప్పటిదాకా తనకు పోటీగా నిలిచిన సెబాస్టియన్ వెటెల్ మెక్సికో రేసులో నాలుగోస్థానంలో నిలువడం హామిల్టన్‌కు కలిసొచ్చింది. తాజా ప్రదర్శనతో వెటల్ 277 పాయింట్లకే పరిమితమయ్యాడు.

దీంతో ఈ సీజన్‌లో మరో రెండు రేసులు మిగిలుండగానే హామిల్టన్ 333 పాయింట్లతో వరల్డ్ చాంపియన్‌షిప్‌ను సొంతం చేసుకున్నాడు. రేసు అనంతరం హామిల్టన్ మాట్లాడాడు. ఇదొక అద్భుతమైన రేసు అని, ఎప్పుడూ ఆశలు వదులుకోలేదని అన్నాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:23 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+