Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

లూయిస్ హమిల్టన్‌దే మొనాకో గ్రాండ్‌ప్రి

Hamilton clings on for Monaco glory but Mercedes one-two run ends

ఐదుసార్లు ఫార్ములావన్‌ ప్రపంచ ఛాంపియన్‌, మెర్సిడెస్ స్టార్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ మొనాకో గ్రాండ్ ప్రి విజేతగా నిలిచాడు. చివరి వరకు సాగిన ఈ రేసులో సెకను కన్నా తక్కువ సమయంలోనే ప్రత్యర్థిని వెనక్కినెట్టి టైటిల్‌ గెలిచాడు. రేసును గంటా 43 నిమిషాల 28.437 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని సంపాదించాడు. ఫెరారీ డ్రైవర్ సెబాస్టియన్ వెటల్ రెండో స్థానంలో నిలిచాడు. వాల్తేరి బొటాస్ మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం

ఈ విజయంతో ఎఫ్‌-1 డ్రైవర్ల జాబితాలో హమిల్టన్‌ (137 పాయింట్లు) మెరుగైన స్థానంలో నిలిచాడు. హామిల్టన్ జట్టు సభ్యుడు వాల్తేరి బొటాస్‌ (120) తర్వాత స్థానంలో ఉన్నాడు. ప్రధాన రేస్‌కు ముందు శనివారం జరిగిన క్వాలిఫయింగ్ టోర్నీలో అగ్రస్థానంలో నిలిచి పోల్ పొజిషన్ సాధించిన హామిల్టన్ ఆదివారం రేసులోనూ అదే జోరు సోనసాగించాడు.

అందరికంటే వేగంగా ల్యాప్‌ను ముగించి టైటిల్ గెలుచుకున్నాడు. ఈ సీజన్‌లో మెర్సెడెస్ డ్రైవర్‌కు టైటిల్ దక్కడం ఇది వరుసగా ఆరోసారి. ఇప్పటి వరకు బహ్రెయిన్, చైనా, స్పెయిన్ గ్రాండ్‌ప్రిల్లో హామిల్టన్ విజేతగా నిలవగా.. ఆస్ట్రేలియా, అజర్‌బైజాన్ గ్రాండ్‌ప్రిలను బొటాస్ గెలుచుకున్నాడు. మొనాకో విజయాన్ని ఫార్ములావన్‌ దిగ్గజం నికీ లాడా (ఆస్ట్రియా)కు హామిల్టన్‌ అంకితం ఇచ్చాడు.

Story first published: Monday, May 27, 2019, 9:29 [IST]
Other articles published on May 27, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+