For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జిమ్మాస్టిక్స్‌లో తప్పిదం.. రెండు కాళ్ళు పోగొట్టుకున్న సమంత

Gymnast Samantha Serio breaks her legs, and retires

జిమ్నాస్టిక్స్ కీడా అంటే నియంత్రణ చాలా అవసరం. నియంత్రణతో పాటు అనుభవం కూడా ముఖ్యం. ఈ ఆటలో ఏ చిన్న పొరపాటు జరిగినా ఇక అంతేసంగతులు. తాజాగా ఓ క్రీడాకారిణి చిన్న పొరపాటుతో తన రెండు కాళ్లను విరగొట్టుకుంది. ఈ ఘటన అమెరికాలోని ఆబర్న్ యూనివర్సిటీలో చోటుచేసుకుంది.

అమెరికాలోని ఆబర్న్ యూనివర్సిటీకి చెందిన సమంతా సెరియో అనే జిమ్నాస్ట్ శుక్రవారం జరిగిన బేటన్ రోగ్ రీజనల్ ఫైనల్ పోటీల్లో పాల్గొంది. ఈ క్రమంలో ఫస్ట్ పాస్ చేస్తున్న సమంతా ఎగిరి మ్యాట్ పై ల్యాం డ్ అయ్యింది. ఈ సమయంలో.. ల్యాండింగ్ అదుపుతప్పడంతో ఒక్కసారిగా రెండు కాళ్లూ విరిగిపోయాయి. నొప్పితో సమంతా అక్కడే ఏడ్చేసింది. అయితే కొద్ది సమయం వరకు ఎవరికీ అర్థం కాలేదు. మ్యాచ్ రిఫరీ ఆమె వద్దకు చేరుకునే వరకు కాళ్లు విరిగిన సంగతి తెలియరాలేదు. వెంటనే డాక్టర్లు వచ్చి ఆమెను అక్కడి నుంచి తీసుకెళ్లి వైద్యం అందించారు.

ఈ ఘటన జరిగిన రోజే ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా సమంత సెరియో జిమ్నాస్టిక్స్ కెరీర్‌కు గుడ్‌బై ప్రకటించింది. 'గత 18 ఏళ్లుగా కెరీర్‌కు జిమ్నాస్టిక్స్ ఎంతగానో తోడ్పడింది. ఇష్టమైన ఆటకు దూరం అవుతున్నందుకు బాధగా ఉంది' అని సమంత తెలిపింది. ప్రస్తుతం సమంత కోలుకుంటోంది. ఆమెకు డాక్టర్లు మెరుగైన వైద్యంను అందిస్తున్నారు.

Story first published: Tuesday, April 9, 2019, 15:33 [IST]
Other articles published on Apr 9, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+