Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భారత అథ్లెటిక్స్‌లో సరికొత్త శకం: 100 మీటర్ల రేసులో సంచలనం!

భారత అథ్లెటిక్స్‌లో సరికొత్త చరిత్ర లిఖించబడింది. ఇండియన్ నేవీలో సేవలందిస్తున్న పంజాబ్ కు చెందిన స్ప్రింటర్ గుర్విందర్ వీర్ సింగ్ రాంచీ వేదికగా జరుగుతున్న నేషనల్ సీనియర్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ కప్‌లో సరికొత్త రికార్డుతో సంచలనం సృష్టించాడు. 100 మీటర్ల పరుగు పందెంలో ఇప్పటివరకు ఏ భారతీయుడూ సాధించని విధంగా, 10.1 సెకన్ల మార్కును దాటి సరికొత్త జాతీయ రికార్డును నెలకొల్పాడు. రాంచీలో శనివారం జరిగిన 29వ నేషనల్ ఫెడరేషన్ కప్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో ఆయన ఈ అద్భుతమైన మైలురాయిని అందుకున్నాడు.

ఈ అద్భుత ప్రదర్శనతో ఆయన రాబోయే ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్, ఆసియా గేమ్స్ టోర్నమెంట్లకు అధికారికంగా అర్హత సాధించాడు. గుర్విందర్ వీర్ సింగ్ అంతకుముందు అనిమేష్ కుజూర్ పేరిట ఉన్న జాతీయ రికార్డును గుర్విందర్ బద్దలు కొట్టి దేశంలోన అత్యంత వేగవంతమైన అథ్లెట్‌గా నిలిచాడు. అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఈ తుదిపోరులో ఒడిశాకు చెందిన అనిమేష్ కుజూర్ 10.20 సెకన్ల సమయంతో రెండో స్థానంలో నిలిచి వెండి పతకాన్ని కైవసం చేసుకోగా.. ప్రణవ్ ప్రమోద్ 10.29 సెకన్ల వ్యవధిలో పరుగును ముగించి మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు.

Gurindervir Singh Breaks 100m National Record Becomes Fastest Indian Alive Full Details

అయితే ఈ రేసు ముగిసిన అనంతరం గుర్విందర్ వీర్ సింగ్ ఓ పేపర్‌ను తీసి కెమెరాల వైపు చూపిస్తూ.. "టాస్క్ ఇంకా పూర్తి కాలేదు. ఆగండి, నేను ఇంకా ఇక్కడే ఉన్నాను" అనే ప్రత్యేక సందేశాన్ని ప్రదర్శించారు. దాని పక్కనే "10.10 సెకన్లు" అనే నంబర్‌ను కూడా ఆయన డబుల్ అండర్‌లైన్ చేసి ఉంచడం గమనార్హం.

ఈ చారిత్రాత్మక ప్రదర్శనతో గుర్విందర్‌వీర్ సింగ్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నిర్దేశించిన 2026 కామన్వెల్త్ గేమ్స్ అర్హత సమయాన్ని (10.16 సెకన్లు) విజయవంతంగా అధిగమించారు. అంతేకాకుండా ఈ సీజన్‌లో ఆసియా ఖండంలోనే నమోదైన రెండో అత్యంత వేగవంతమైన సమయంగా ఇది రికార్డుకెక్కింది. ఈ నెలలోనే 10.08 సెకన్ల సమయాన్ని నమోదు చేసిన జపాన్ యువ స్ప్రింటర్ ఫుకుటో కొమురో మాత్రమే ప్రస్తుతం గుర్విందర్‌వీర్ కంటే ముందున్నాడు.

Story first published: Monday, May 25, 2026, 9:18 [IST]
Other articles published on May 25, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+