Gukesh D: భారత ఛెస్ ప్లేయర్ గుకేష్ దొమ్మరాజు.. చరిత్ర సృష్టించాడు. ప్రఖ్యాత ప్రపంచ ఛెస్ ఫెడరేషన్ టోర్నమెంట్‌లో విజయం సాధించాడు. అతి పిన్న వయస్సులో ఈ టైటిల్‌ను గెలుచుకున్న రెండో ఆటగాడు అతనే. గతంలో భారత్‌కే చెందిన గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ ఘనతను సాధించాడు.
ఫిడె క్యాండిడేట్స్ ఛెస్ టోర్నమెంట్ 2024 ఫైనల్ రౌండ్స్ కెనడాలోని టోరంటోలో ఏర్పాటయ్యాయి. రెండు గేమ్‌లుగా పైనల్ రౌండ్ సాగింది. ఫైనల్ రౌండ్‌లో అమెరికాకు చెందిన హికారు నకమురాను నిలువరించగలిగాడు గుకేష్. వారిద్దరి మధ్య జరిగిన గేమ్ డ్రాగా ముగిసింది. రష్యాకు చెందిన ఇయాన్ నెపోమ్నియాచ్చి- ఫ్యాబియానో కరువానా మధ్య జరిగిన మరో గేమ్ కూడా డ్రా అయింది.

అప్పటికే గుకేష్ తొమ్మిది పాయింట్లతో ముందంజలో ఉండటంతో అతన్ని విజేతగా ప్రకటించింది ఫిడె. ఇందులో గెలవాలంటే 14 పాయింట్లను సాధించాల్సి ఉంటుంది. ఎవరికీ అన్ని పాయింట్లు దక్కలేదు. ఫైనల్ రౌండ్‌కు చెందిన నలుగురు ప్లేయర్లల్లో అత్యధికంగా తొమ్మిది పాయింట్లతో గుకేష్ మొదటిస్థానంలో నిలిచాడు.
ఈ విజయంతో వరల్డ్ ఛెస్ ఛాంపియన్‌షిప్ టోర్నమెంట్‌లో ఆడే అవకాశం లభించిందతనికి. ఈ టోర్నమెంట్‌లో చైనాకు చెందిన వరల్డ్ ఛెస్ ఛాంపియన్ గ్రాండ్ మాస్టర్ డింగ్ లైరెన్‌తో తలపడనున్నాడు. గ ఏడాది హాంగ్ఝౌలో జరిగిన ఆసియా క్రీడోత్సవాల్లో ఛెస్ టోర్నీలో రజత పతకం సాధించాడు గుకేష్.
ఫిడె క్యాండిడేట్స్ టోర్నమెంట్ 2024ను గెలిచిన గుకేష్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. విశ్వనాథన్ ఆనంద్, వ్లాదిమిర్ క్రామ్నిక్, కోనేరు హంపి, డేవిడ్ హావెల్, తాన్యా సచ్‌దేవ్, హాన్స్ నీమన్, దేశీయ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్ర వంటి ప్రముఖులు గుకేష్‌ను అభినందించారు.