రియో డీ జనీరో: బ్రెజిల్‌లో జరుగుతున్న రియో ఒలింపిక్స్‌లో మనవడికి మెడల్ లభించిందన్న ఆనందం తట్టుకోలేని అతడి బామ్మ చనిపోయింది. ఈ విషాదకర సంఘటన థాయిలాండ్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే...
థాయిలాండ్‌కు దేశానికి చెందిన ఆర్మీ అథ్లెట్ 20 ఏళ్ళ వెయిట్ లిఫ్టర్ సిన్‌ఫేట్ కృయాయిథాంగ్ 56 కేజీల విభాగంలో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం సాధించాడు.
రియో ఒలింపిక్స్: మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మనవడి క్రీడా ప్రతిభను టీవీ ద్వారా ప్రత్యక్షంగా వీక్షించిన 84 ఏళ్ళ సుబిన్ ఖోంగ్‌థాప్ ఆ సంతోషం పట్టలేక అక్కడిక్కకడే కుప్పకూలిపోయింది. పతకం సాధించిన క్రమంలో సంబురాలు చేసుకోవాల్సిన థాయి వాసులు ఆమె మరణంతో ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయారు.

అయితే ఆమె గుండెపోటుతో చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. మనవడు సిన్‌ఫేట్ రియోలో పాల్గొనేందుకు వెళ్తున్నప్పుడు కూడా సుబిన్ తీవ్ర ఉద్వేగానికిలోనైనట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. తన మనవడు పతకం సాధించి దేశానికి పేరు ప్రతిష్టలు తీసుకొస్తాడని ఆమె గాఢంగా విశ్వసించింది.
రియో ఒలింపిక్స్ ఫోటోల కోసం ఇక్కడ క్లిక్ చేయిండి
అతడిని ఆశీర్వదించి బ్రెజిల్‌లోని రియో ఒలింపిక్స్‌కు పంపించింది. దీనిపై సిన్‌ఫేట్ మాట్లాడుతూ బామ్మ ఎక్కువ సంతోషానికి లోనయ్యే మరణించిందని నేను ఖచ్చితంగా చెప్పలేను చెప్పుకొచ్చారు. గతంలోనే తన బామ్మ అనారోగ్యంతో ఉన్నట్లు సిన్‌ఫేట్ తెలిపాడు.