న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నోవాటెల్‌ హోటల్లో ఘనంగా గ్రాండ్‌ మాస్టర్‌ హరికృష్ణ వివాహం

By Nageshwara Rao
Grandmaster Hari Krishna got married with serbian player

హైదరాబాద్: భారత చెస్‌ స్టార్‌, గ్రాండ్ మాస్టర్ హరికృష్ణ పెంటేల ఓ ఇంటి వాడయ్యాడు. సెర్బియాకు చెందిన మాజీ చెస్ ప్లేయర్ నదెడ్జాను శనివారం పెళ్లి చేసుకున్నాడు. హైదరాబాద్‌లోని నోవాటెల్‌ హోటల్‌లో శనవారం వీరి పెళ్లి బంధువుల సమక్షంలో అంగరంగ వైభంవంగా జరిగింది.

పెళ్లి కూతురు నదెడ్జా విదేశీయురాలైనప్పటికీ తెలుగు సంప్రదాయానికి తగ్గట్లుగా చీరలో ముస్తాబైంది. ఇది అందరినీ ఆకట్టుకుంది. వీరి పెళ్లి హిందూ సంప్రదాయ పద్ధతిలో జరగడం విశేషం. చెస్‌ క్రీడాకారిణి, ఆర్బిటర్‌ అయిన నదెడ్జాతో హరికృష్ణకు ఎప్పటినుంచో పరిచయం ఉంది.

పలు చెస్ టోర్నీల సందర్భంగా వీళ్లు కలుసుకునేవాళ్లు. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. దీంతో ఇరు కుటుంబ పెద్దలను ఒప్పించి ప్రేమ వివాహం చేసుకున్నారు. నదెడ్జాకు తెలుగు రాకపోయినప్పటికీ.. సెర్బియాతోపాటు మన సంస్కృతులను కూడా తను గౌరవిస్తుందని హరికృష్ణ తెలిపాడు.

కొద్ది రోజులు తన తల్లిదండ్రులతో కలిసిపోతే.. తను తేలిగ్గా తెలుగు నేర్చుకుంటుందని ఆయన నమ్మకంగా చెప్పాడు. విశ్వనాథన్ ఆనంద్ స్ఫూర్తితో చదరంగంలోకి అడుగుపెట్టిన.. హరికృష్ణ అగ్రశ్రేణి ఆటగాడిగా ఎదిగాడు.

Grandmaster Hari Krishna got married with serbian player

గుంటూరు జిల్లాకు చెందిన హరికృష్ణ అతిపిన్న వయసులో గ్రాండ్ మాస్టర్‌గా హోదా సాధించిన భారతీయుడిగా రికార్డు నెలకొల్పాడు. కాగా, ఈ పెళ్లి వేడుకకు తెలంగాణ క్రీడాశాఖ మంత్రి పద్మారావు, బ్యాడ్మింటన్‌ చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌, పలువురు చెస్‌ క్రీడాకారులు హాజరయ్యారు.

Story first published: Sunday, March 4, 2018, 10:23 [IST]
Other articles published on Mar 4, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X