స్వర్ణ విజేత: నైనా జైస్వాల్‌కు ఘనస్వాగతం(పిక్చర్స్)
హైదరాబాద్: పాకిస్థాన్‌లో జరిగిన దక్షిణాసియా జూనియర్, క్యాడెట్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్ షిప్‌లో స్వర్ణాలతో మెరిసిన హైదరాబాద్ క్రీడాకారిణి నైనా జైస్వాల్ సోమవారం నగరానికి చేరుకున్నారు. ఆమెకు అభిమానులు, నగరవాసులు ఘన స్వాగతం పలికారు. ఆమె వెంట కోచ్, ఆమె తండ్రి, బాడీ బిల్డర్ మోతే శ్యామ్ ఉన్నారు.
కాగా, నైనాతో పాటు మరో క్రీడాకారిణి ఆకుల శ్రీజ రెండు స్వర్ణాలు సాధించగా, ఆర్ స్నేహిత్ ఓ స్వర్ణం, రజతం సాధించాడు. ఇస్లామాబాద్‌లోని పాకిస్థాన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఆగస్టు 27 నుంచి 29 వరకు జరిగిన ఈ టోర్నీలో నైనా జైస్వాల్, ఆకుల శ్రీజలు రెండు స్వర్ణాలు సాధించారు.
మరో క్రీడాకారుడు స్నేహిత్ ఓ స్వర్ణం, రజతం సాధించాడు. క్యాడెట్ బాలికల సింగిల్స్, టీమ్ ఈవెంట్‌లలో నైనా జైస్వాల్ గెలవగా.. శ్రీజ టీమ్ ఈవెంట్ తోపాటు డబుల్స్‌లో పసిడి పతకాలు సాధించింది. ఇక స్నేహిత్ టీమ్ ఈవెంట్‌లో స్వర్ణంతోపాటు క్యాడెట్ బాలుర సింగిల్స్‌లో రజతం దక్కించుకున్నాడు.

స్వర్ణ విజేతకు స్వాగతం
పాకిస్థాన్‌లో జరిగిన దక్షిణాసియా జూనియర్, క్యాడెట్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్ షిప్‌లో స్వర్ణాలతో మెరిసిన హైదరాబాద్ క్రీడాకారిణి నైనా జైస్వాల్ సోమవారం నగరానికి చేరుకున్నారు.

స్వర్ణ విజేతకు స్వాగతం
నైనా జైస్వాల్‌కు అభిమానులు, నగరవాసులు ఘన స్వాగతం పలికారు. ఆమెకు అభినందనలు తెలిపారు.

స్వర్ణ విజేతకు స్వాగతం
నైనాతో పాటు మరో క్రీడాకారిణి ఆకుల శ్రీజ రెండు స్వర్ణాలు సాధించగా, ఆర్ స్నేహిత్ ఓ స్వర్ణం, రజతం సాధించాడు.

స్వర్ణ విజేతకు స్వాగతం
ఇస్లామాబాద్‌లోని పాకిస్థాన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఆగస్టు 27 నుంచి 29 వరకు జరిగిన ఈ టోర్నీలో నైనా జైస్వాల్, ఆకుల శ్రీజలు రెండే స్వర్ణాలు సాధించారు.

స్వర్ణ విజేతకు స్వాగతం
క్యాడెట్ బాలికల సింగిల్స్, టీమ్ ఈవెంట్‌లలో నైనా జైస్వాల్ గెలవగా.. శ్రీజ టీమ్ ఈవెంట్ తోపాటు డబుల్స్‌లో పసిడి పతకాలు సాధించింది. ఇక స్నేహిత్ టీమ్ ఈవెంట్‌లో స్వర్ణంతోపాటు క్యాడెట్ బాలుర సింగిల్స్‌లో రజతం దక్కించుకున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications