Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అతన్ని కెప్టెన్‌ చేయడం పెద్ద తప్పు: గ్రేమ్ స్వాన్

Kevin Pietersen
ఇటీవల కాలంలో సెలబ్రటీలకు ఆటోబయోగ్రఫీ(ఆత్మకధ)లు రాయడం పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. సరే రాస్తే రాశారు పుస్తకం గురించి మరింత పబ్లిసిటీ రావాలనే ఉద్దేశ్యంతో ఎవరినో ఒకరిపై వివాదస్పద వ్యాఖ్యలు చేస్తారు. పాకిస్ధాన్ ఫాస్ట్ బౌలర్ రావల్పిండి ఎక్స్ ప్రెస్ షోయబ్ అక్తర్ రాసిన కాంట్రవర్సిల్లీ యువర్స్ అనే తన ఆత్మకధలో క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ గురించి వివాస్పద వ్యాఖ్యలు చేసి కొన్ని వారాలు గడవక ముందే ఇంగ్లాండ్‌ స్పిన్‌ బౌలర్‌ గ్రేమ్‌ స్వాన్‌ తన తోటి ఆటగాడు, ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కెవిన్‌ పీటర్సన్‌‌పై ది బ్రేక్స్‌ ఆర్‌ ఆఫ్‌ " పేరుతో స్వాన్‌ ఆటోబయోగ్రఫీని (ఆత్మకధ)లో వివాద స్పద వ్యాఖ్యలు చేయడం జరిగింది.

ఇంతకీ గ్రేమ్ స్వాన్ తను రాసిన జీవిత చరిత్ర పుస్తకంలో కెవిన్ పీటర్సన్‌ని ఏమన్నాడంటే బ్యాట్స్‌మన్‌గా పేరున్నప్పటికీ పీటర్సన్ కెప్టెన్‌గా పనికిరాడనే అభిప్రాయాన్ని తెలిపాడు. 'పీటర్సన్ అద్భుతంగా ఆడతాడనడంలో సందేహం లేదు. కానీ నా అభిప్రాయం ప్రకారం ఇంగ్లండ్ జట్టు కెప్టెన్ అయ్యే అర్హత లేదు. అతడికున్న నైపుణ్యం నాయకత్వ లక్షణాలకు సరిపోదు" అని స్వాన్ రాసుకోవడం జరిగింది. ఇక ఇంగ్లాండ్ మరో కెప్టెన్ స్ట్రాస్‌ మాత్రం శాంతియుతంగా వ్యవహరించే తీరు తనకు ఎంతో నచ్చుతుందని పుస్తకంలో రాశాడు. 2008 చెన్నై టెస్టులో పీటర్సన్ 'F****** " అక్షరంతో ప్రారంభమయ్యే బూతు పదాన్ని వాడుతూ గట్టిగా అరిచాడని గుర్తు చేశాడు.

మ్యాచ్‌లలో అప్పుడప్పుడు చిన్న చిన్న తప్పులు జరుగుతాయని అంత మాత్రాన ఆటగాళ్లపై సిరియస్ అవడం భావ్యం కాదని అన్నాడు. పీటర్సన్‌లో మాత్రం కెప్టెన్‌గా సరిపోయే అర్హతలు లేవని అన్నాడు. ఐతే ప్రస్తుతానికి ఇంగ్లాండ్ టీమ్ సరైన సారధి చేతిలో ఉందని ప్రస్తుతం ఉన్న ఇంగ్లాండ్ కెప్టెన్ స్ట్రాస్‌పై ప్రశంసలు కురిపించాడు.
Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+