హాంకాంగ్ ఓపెన్: కోచ్‌గా గోపీచంద్ అరుదైన ఘనత
హైదరాబాద్: తాను సాధించలేని ఒలింపిక్స్ పతకాలను తన శిష్యుల ద్వారా సాధించి తన కోరికను నెరవేర్చుకున్నాడు భారత మాజీ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్. అంతేకాదు భారత బ్యాడ్మింటన్ రూపురేఖల్ని మార్చగలిగిన యువ క్రీడాకారుల్ని తయారు చేసి అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నాడు.
2003లో కోచ్‌గా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన గోపీ అకాడమీని ప్రారంభించిన గోపీచంద్.... 2012 లండన్ ఒలింపిక్స్‌లో సైనా నెహ్వాల్ కాంస్యం గెలిచేలా శిక్షణ ఇచ్చాడు. రియో ఒలింపిక్స్‌లో పీవీ సింధుతో రజతం గెలిపించి బ్యాడ్మింటన్ క్రీడలో భారత చరిత్రను ప్రపంచానికి చాటాడు.
తాజాగా గోపీచంద్ శిష్యులైన పీవీ సింధు, సమీర్ వర్మలు హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరిస్ ఫైనల్స్‌లో జరిగిన హోరాహోరీ పోరులో ఓటమి పాలయ్యారు. అయితే కోచ్‌గా గోపీచంద్ ఓ అరుదైన ఘనతను సాధించాడు. హాంకాంగ్ సూపర్‌కు ఓ ప్రత్యేకత ఉంది. బ్యాడ్మింటన్‌లో అన్ని సూపర్ సిరిస్‌లతో పోలిస్తే హాంకాంగ్ సూపర్ సిరిస్ మొదటి స్ధానంలో ఉంటుంది.
అలాంటి హాంకాంగ్ సూపర్ సిరిస్ ఫైనల్స్‌లో గోపీచంద్ అకాడమీకి చెందిన ఇద్దరు క్రీడాకారులు హాంకాంగ్ పైనల్స్‌కు చేరుకున్నారు. మహిళల సింగిల్స్ విభాగంలో పీవీ సింధు ఫైనల్స్‌కు చేరగా, పురుషుల విభాగంలో సమీర్ పైనల్స్‌లో ఆడారు. అయితే వీరిద్దరు కూడా ఫైనల్ పోరులో ఓటమి పాలయ్యారు.

రన్నరప్ టైటిళ్లు
హాంకాంగ్ టోర్నీ ఆద్యంతం అద్భుతమైన ఆటతీరుని ప్రదర్శించిన వీరిద్దరూ ఫైనల్స్‌లో ఓటమిపాలై రన్నరప్ టైటిళ్లతో సరిపెట్టుకున్నారు. గతవారం చైనా ఓపెన్ సూపర్ సిరిస్ టైటిల్‌ను గెలిచి జోరుమీదున్న పీవీ సింధు హాంకాంగ్ ఓపెన్‌లో ఫైనల్ చేరినప్పటికీ టైటిల్ మాత్రం దక్కించుకోలేకపోయింది.

ఫైనల్స్‌లో సింధు ఓటమి
మహిళల సింగిల్స్ ఫైనల్లో సింధు 15-21, 17-21తో చైనీస్ తైపీకి చెందిన ప్రపంచ మూడో ర్యాంకర్ తాయ్ జూ యింగ్ చేతిలో ఓటమి పాలైంది. టైటిల్ పేవరేట్‌గా బరిలోకి అడుగుపెట్టిన పీవీ సింధు తాయ్ జూ యింగ్ చేతిలో వరుసగా పరాజయం పాలైంది.

పరాభవానికి ప్రతీకారం
ఈ విజయంతో తాయ్ జూ యింగ్ ఇటీవల రియో ఒలింపిక్స్‌లో సింధు చేతిలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకున్నట్లైంది. సెమీస్‌లో ప్రపంచ నెంబర్ వన్, రియో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత కరోలినా మారిన్‌ను కంగుతినిపించిన తాయ్ జూ యింగ్... సింధుపై విజయం సాధించి ఒకే టోర్నీలో ఒలింపిక్ ఫైనలిస్టులను ఓడించిన షట్లర్‌గా ఘనత సాధించింది.

సమీర్ పోరాడిన తీరు అద్భుతం
సెమీస్‌లో ప్రపంచ మూడో ర్యాంకర్‌ను చిత్తుచేసి సంచలనం సృష్టించిన సమీర్ తుదిపోరులో ఓడినా ప్రత్యర్థిపై పోరాడిన తీరు అభిమానులను ఆకట్టుకుంది. స్థానిక ఆటగాడు నాగ్ కా లాగ్ ఆగ్నస్‌తో జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో సమీర్ 14-21, 21-10, 11-21తో ఓటమి పాలయ్యాడు.

మూడోగేమ్‌లో తడబాటు
యాభై నిమిషాలపాటు సాగిన ఈ హోరాహోరీ మ్యాచ్‌లో రెండోగేమ్ నెగ్గి ప్రత్యర్థికి సవాల్ విసిరిన సమీర్.. నిర్ణయాత్మక మూడోగేమ్‌లో తడబాటుకు గురై రన్నరప్‌గా నిలిచాడు. ఈ ఏడాది జాతీయ చాంపియన్‌గా నిలిచిన 22 ఏళ్ల సమీర్ సూపర్‌సిరీస్ ఫైనల్లో ఆడడం అతని కెరీర్‌లో ఇదే తొలిసారి. మధ్యప్రదేశ్‌కు చెందిన సమీర్ మూడేళ్ల క్రితం బహ్రెయిన్ ఇంటర్నేషనల్ సిరీస్, బహ్రెయిన్ ఇంటర్నేషనల్ చాలెంజ్ టైటిళ్లను గెలుపొందాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications