Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

2వారాల్లో 2టైటిల్స్: పాలవాడి కొడుకు రికార్డు

న్యూఢిల్లీ: హర్యానాకు చెందిన శుభమ్ జగ్లాన్ అనే 10 ఏళ్ల బాలుడు కేవలం రెండు వారాల్లో రెండు అంతర్జాతీయ గోల్ఫ్ మెడల్స్‌ను సాధించి గోల్ఫ్ క్రీడలో చరిత్ర సృష్టించాడు. గత ఆదివారం కాలిఫోర్నియాలో నిర్వహించిన జూనియర్ వరల్డ్ గోల్ఫ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో విజేతగా నిలిచాడు.

ఆ తర్వాత తాజాగా గురువారం అమెరికాలోని లాస్ వేగాస్‌లో జరిగిన ఏజేజీఏ వరల్డ్ స్టార్స్ ఆఫ్ జూనియర్ గోల్ఫ్ ఈవెంట్‌లో పాల్గొని ఛాంపియన్‌గా అవతరించాడు. హర్యానాలోని ఇస్రానా గ్రామానికి చెందిన శుభమ్ జగ్లాన్ తండ్రి పాలు అమ్ముకుని జీవనం సాగిస్తున్నాడు.

Golf: Haryana milkman's 10-year-old son creates history, wins another World junior title

నిరుపేద, సాధారణ కుటుంబానికి చెందిన శుభమ్ జగ్లాన్ రెండు వారాల్లో రెండు అంతర్జాతీయ గోల్ఫ్ మెడల్స్‌ను సాధించడం విశేషం. తాను సాధించిన విజయం పట్ల శుభమ్ జగ్లాన్ సంతోషం వ్యక్తం చేశాడు. తాను విజయం సాధించినందుకు అభినందిస్తుంటే గొప్పగా ఉందని ఓ ప్రముఖ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో పేర్కొన్నాడు.

చిన్నప్పటి నుంచి గోల్ఫ్‌పై ఉన్న అభిమానంతో తండ్రి పోలాన్నే గోల్ఫ్ కోర్సుగా చేసుకుని ప్రాక్టీస్ చేసేవాడు. గోల్ఫ్‌కు సంబంధించి ఆటలో మెళకువలను కంప్యూటర్‌లో యూట్యూబ్ వీడియోలు చూస్తే నేర్చుకునేవాడు. ఆ క్రమంలో తన గ్రామానికి సమీపంలో ఓ ఎన్నారై ఏర్పాటు చేసిన గోల్ఫ్‌ రేంజ్‌లో ప్రాక్టీస్‌ చేస్తూ జగ్లాన్‌, దాదాపు వంద టోర్నీల్లో విజేతగా నిలిచాడు.

<center><iframe width="100%" height="371" src="https://www.youtube.com/embed/3RHhs8HQEKA" frameborder="0" allowfullscreen></iframe></center>

Story first published: Tuesday, November 14, 2017, 10:23 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+