For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తలకెక్కిన పైత్యం: గోల్‌కీపర్‌కు మూత్రం తాగించిన ఫ్యాన్స్

బెర్న్: లోయర్ డివిజన్ స్విస్ లీగ్ మ్యాచులో జరిగిన విపరీతమైన సంఘటన ఫుట్‌బాల్ ప్రపంచాన్ని ఒక్కసారిగా షాక్‌కు గురి చేసింది. స్విట్జర్లాండ్‌కు చెందిన ఓ ఫుట్‌బాల్ జట్టు గోల్ కీపర్‌తో అవతలి జట్టు అభిమానులు ఏకంగా మూత్రంగా తాగించి అతడిని ఘోరంగా అవమానించి వికృతానందాన్ని పొందారు.

ఎఫ్‌సి మురి జట్టు గోల్ కీపర్ రెటో ఫెల్డర్ ఆట మధ్యలో తన బాటిల్ తీసుకుని అందులోని ద్రవం తాగాడు. అయితే అందులో వెచ్చగా ఉన్న ద్రవం తాగాక తాను చాలా ఇబ్బందికి గురయ్యానని అతడు తెలిపాడు. ఒక ఆటగాడికి మూత్రం తాగించాలనే వికారమైన ఆలోచన అభిమానులకు రావడం చాలా దురదృకరమని అక్కడి మీడియా కథనాలు వెల్లడించాయి. ఘటనకు సంబంధించిన వీడియోలను అధికారులు పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నాయి.

 Goalkeeper 'Drinks' Piss After Rival Fans Urinate in His Bottle

ఆ దేశ మీడియా కథనాల ప్రకారం.. గుర్తుతెలియని కొందరు ప్రత్యర్థి జట్టు అభిమానులు బాల్‌బాయ్‌తో గోల్ కీపర్‌కు సంబంధించిన బాటిల్‌ను తెప్పించుకున్నారు. ఆ తర్వాత అందులో మూత్రం పోసి మళ్లీ ఆ బాటిల్‌ను ఆ గోల్ కీపర్ వద్దకు చేర్చారు. ఇదంతా గమనించని గోల్ కీపర్ ఆట మధ్యలో బాటిల్లోని ద్రవాన్ని సేవించిన తర్వాత, వికృత చేష్టకు పాల్పడిన అభిమానులు 'ఇప్పుడు నీకు ఎయిడ్స్ ఉంది' అని కేకలు వేశారు.

కాగా, కొందరు దుండగులు ఇలాంటి వికృత చేష్టకు పాల్పడటం దురృష్టకరమని మురి కోచ్ బీట్ హుబ్లీ అన్నాడు. తన జీవిత కాలంలో ఇలాంటి ఘటన ఎప్పుడు చూడలేదని చెప్పాడు. బడెన్ అధ్యక్షుడు థోమి బ్రామ్ ఈ ఘటనపై గోల్ కీపర్‌కు క్షమాపణలు చెప్పాడు. ఈ ఘటనపై విచారణ చేపట్టి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+