Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

గోవా స్విమ్మింగ్ చీఫ్ కోచ్‌పై వేటు.. మైనర్ బాలికపై అత్యాచారంతో సస్పెన్షన్...

Goa chief swimming coach sacked for molesting minor girl

న్యూఢిల్లీ : మైనర్ బాలికపై అత్యాచారం గోవా స్విమ్మింగ్ కోచ్‌పై వేటుపడింది. సురజిత్ గంగూలీని పదవీ నుంచి తప్పిస్తున్నట్టు స్విమ్మింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ) ప్రకటించింది. ఈ మేరకు ఎస్ఎఫ్ఐ అధ్యక్షుడు దిగంబర్ కామత్ మీడియాకు వివరాలు వెల్లడించారు. మైనర్ బాలికపై లైంగికదాడికి సంబంధించి .. సురజిత్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ట్రోల్ అయ్యాయి. దీనిపై కేంద్రమంత్రి కిరెణ్ రిజిజు స్పందించారు. వెంటనే చర్యలు తీసుకోవాలని .. ఎస్ఎఫ్ఐని ఆదేశించగా .. ఈ మేరకు స్విమ్మింగ్ కోచ్ పదవీ నుంచి తప్పిస్తున్నట్టు ప్రకటించింది.

గోవా స్విమ్మింగ్ కోచ్ సురజిత్ ఓ మైనర్ బాలికతో లైంగికదాడికి సంబంధించి ఫోటోలు, వీడియోలు వెలుగుచూశాయి. కొందరు వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఎస్ఎఫ్ఐ సుమోటోగా స్పందించింది. మరోవైపు నిన్న సినిమా ఇండస్ట్రీకి చెందిన వినోద్ కప్రీ వీడియోను కేంద్ర క్రీడల శాఖ మంత్రి కిరెణ్ రిజెజుకు ట్యాగ్ చేశారు. దీంతో కేంద్రమంత్రి స్పందించారు. స్విమ్మింగ్ కోచ్ ప్రవర్తనను సీరియస్‌గా తీసుకోవాలని ఎస్ఎఫ్ఐను ఆదేశించారు. కేంద్రమంత్రి ఆదేశాలతో రాష్ట్ర విభాగం కమిటీ వేసింది. సురజిత్ లైంగికదాడి నిజమేనని కమిటీ తేల్చడంతో .. చీఫ్ కోచ్ పదవీ నుంచి తప్పిస్తున్నట్టు ప్రకటించింది. మరోవైపు సురజిత్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని కేంద్రమంత్రి రిజిజు ఆదేశించారు.

గోవా చీఫ్ కోచ్ సురజిత్ .. గోవా స్విమ్మింగ్ విభాగంలో ప్రభుత్వ ఉద్యోగి కాదని కేంద్ర మంత్రి రిజెజు తెలిపారు. కానీ దీనిని తీవ్రంగా పరిగణించామని పేర్కొన్నారు. అతనితో గోవా ఎస్ఎఫ్ఐకు ఉన్న కాంట్రాక్టును కూడా రద్దు చేసినట్టు తెలిపారు. దేశంలోని మిగతా స్విమ్మింగ్ ఫేడరేషన్‌లో కూడా సురజిత్‌ను తీసుకోవద్దని స్పష్టంచేశారు. ఈ ఆదేశాలు అన్నీ ఫెడరేషన్లకు వర్తిస్తాయని తేల్చిచెప్పారు. దీనిపై గోవా డైరెక్టర్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ యూత్ విభాగం కూడా స్పందించింది. సురజిత్ అంశాన్ని తమకు కామత్ తెలియజేశారని పేర్కొన్నారు. అతన్ని గోవా చీఫ్ కోచ్ పదవీ నుంచి తప్పిస్తున్నట్టు పేర్కొన్నారని తెలియజేశారు.

Story first published: Thursday, September 5, 2019, 13:53 [IST]
Other articles published on Sep 5, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+