
హైదరాబాద్: టాటా స్టీల్ చెస్ ఛాలెంజర్స్ 2018 టైటిల్‌ను గ్రాండ్ మాస్టర్ విదిత్ గుజ్రాతి సొంతం చేసుకున్నాడు. నెదర్లాండ్స్‌లోని వేదికగా జనవరి 12 నుంచి 28 వరకు జరిగిన ఈ పోటీలో విదిత్‌ను విజయం వరించింది.
ఈ విజయంతో వచ్చే ఏడాది జరగబోయే 2019 టాటా స్టీల్ మాస్టర్స్ టోర్నీకి కూడా అర్హత సాధించాడు. ఈ పోటీకి ప్రపంచ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్‌సన్ సైతం హాజరుకానున్నట్లు సమాచారం. విదిత్ ఫస్ట్ సీడ్‌ను 2718 రేటింగ్‌తో మొదలుపెట్టాడు. అతనికి ప్రత్యర్థులుగా ఈజిప్టుకు చెందిన బసీమ్ అమీన్(2693), పోలాండ్‌కు చెందిన మైకేల్ క్రాసెన్‌కొవ్(2671), ఉక్రెయిన్‌కు చెందిన (2654) తలపడ్డారు.
విదిత్ ఐదు రౌండ్లలో పోటీపడి 9.0/13 పాయింట్లు సొంతం చేసుకున్నాడు. పదకొండో రౌండ్లో విదిత్‌కు కొరొబొవ్‌కు మధ్య కాంపిటేషన్ మొదలు అవకముందు ఇద్దరూ 7.5 పాయింట్లతో టై అయ్యారు. ఆఖరి రెండు రౌండ్లలో విదిత్ 1.5 పాయింట్లు, కొరొబొవ్ 0.5/2 పాయింట్లు సంపాదించడంతో విదిత్‌కు టోర్నమెంట్ చేజిక్కింది.
టోర్నీ గెలిచిన ఆనందంలో విదిత్ మాట్లాడుతూ.. భవిష్యత్తులో చెస్ మీద మరింత ముందుకు వెళ్లాలనుకుంటున్నాను. రాబోయే సంవత్సరాలలో ప్రపంచ ఛాంపియన్‌షిప్ కోసం సిద్ధమవుతున్నాను. అందుకు నేను ఇంకా కష్టపడాల్సి ఉంది. ఈ విజయం నన్ను ప్రతిష్ఠాత్మకమైన రాబిన్ ఈవెంట్స్ 2018కు ప్రవేశం కల్పిస్తాయని ఆశపడుతున్నాను. అని పేర్కొన్నాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.