కోహ్లీ గర్ల్‌ఫ్రెండ్‌కు నో చాన్స్: భార్యలకే పర్మిషన్
ముంబై: ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్న స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ చెంతకు ప్రేయసి అనుష్క శర్మ వెళ్లే పరిస్థితి లేదు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) ఆస్ట్రేలియాలో ఉన్న భారత క్రికెటర్ల చెంతకు వారి భార్యలు వెళ్లడానికి అనుమతి ఇచ్చింది గానీ గర్ల్ ఫ్రెండ్స్‌కు అనుమతి ఇవ్వలేదు.
అస్ట్రేలియాతో మూడు మ్యాచుల ట్వంటీ20 సిరీస్ జరగనుంది. ఈ సందర్భంగా ఐదుగురు క్రికెటర్ల భార్యలు ఆస్ట్రేలియాకు వెళ్లనున్నారు. అజింక్యా రహనే భార్య రాధిక, ఉమేష్ యాదవ్ భార్య తాన్యా, రోహిత్ శర్మ భార్య రితిక, హర్భజన్ సింగ్ భార్య గీతా బాస్రా, ఆశిష్ నెహ్రా భార్య రుష్మలకు ఆస్ట్రేలియా వెళ్లడానికి అనుమతి లభించింది.

ఐదు వన్డేల సిరీస్ ఆడిన కొంత మంది భారత ఆటగాళ్లు ఆస్ట్ర్లేలియాలోనే ఉండిపోయారు. అజింక్యా రహనే గాయం నుంచి కోలుకుంటున్నాడు దీంతో ట్వంటీ20 సిరీస్ కోసం ఆయన అక్కడే ఉండిపోయాడు. రెండు, మూడు ట్వంటీ20 మ్యాచులు ఆడే అవకాశం ఉంది.
అజింక్యా రహనే భార్య ఇప్పటికే ఆస్ట్రేలియా చేరుకుంది. ఆస్ట్రేలియా వెళ్తున్న క్రికెటర్ల భార్యలకు తగిన ఏర్పాట్లు చేయాలని లాజిస్టిక్ మేనేజర్ రిషికేష్ ఉపాధ్యాయకు తగిన ఆదేశాలు వెళ్లాయి. తన భార్య సాక్షిని, కూతురు జీవాను ఆస్ట్రేలియాకు అనుతించాలని ధోనీ కోరాడు. అయితే, పర్యటన త్వరలో ముగిసే అవకాశం ఉన్నందున సాక్షి ఆస్ట్రేలియా వెళ్తారా లేదా అనేది అనుమానమే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications