
హైదరాబాద్ : ప్రపంచ ఛాంపియన్‌షిప్ పీఎస్‌ఏలో భాగంగా జరుగుతున్న లీగ్‌లో భారత్‌కు చెందిన స్క్వాష్ ఆటగాడు సౌరవ్ గోసల్ మూడో రౌండ్‌కి చేరుకున్నాడు. రెండో రౌండ్‌లో ఇంగ్లాండ్‌కు చెందిన బెన్ కాలెమన్‌తో పోటీ పడి 11-4, 11-3, 11-4 స్కోరుతో మూడో రౌండ్ (ఫ్రీ కార్టర్ ఫైనల్)కి ఉత్తీర్ణత సాధించాడు.
"నేనెలా ఆడాలనుకున్నానో అలా ఆడగల్గినందుకు సంతోషంగా ఉంది. బెన్‌తో ఆడటం నాకు ఇదే మొదటిసారి. నేను మొదటి నుంచి చివరి వరకు ఒకే స్థాయిలో ఆడటం వల్లే నెగ్గగలిగాను." అని విజయోత్సాహంతో తన ఆనందాన్ని పంచుకున్నాడు.
కాగా, భారత్ కు చెందిన దీపికా పల్లికల్ కార్తీక్, జోత్స్న చిన్నప్ప మొదటి రౌండ్ లో పోటీ పడి పరాజయం పాలైయ్యారు. 16 ర్యాంకు కల్గి ఉన్న ఘోసల్ మాంచెస్టర్ వేదికపై పోటీ పడి 53వ ర్యాంకర్ అయిన కాలెమన్ (ఇంగ్లాండ్)ను ఓడించాడు. బుధవారం డిసెంబరు 13న తర్వాతి రౌండ్‌లో ఛాంపియన్ కరీమ్ అబ్దుల్ గావద్ (ఈజిప్ట్) తలపడాల్సి ఉంది.
ఇక్కడ వరకు వచ్చిన దీపిక, జోత్స్న మొదటి రౌండ్‌లోనే ఓడిపోయి వెళ్లిపోవటం బాధగా ఉంది. నేను మున్ముందు రౌండ్లలో కూడా గెలుస్తాననే నమ్మకం ఉంది. అమెరికాకు చెందిన ఒలివియాతో తలపడి దీపికా ఓడిపోయింది. ఈజిప్ట్ కు చెందిన సల్మాతో జరిగిన పోటీలో చిన్నప్ప ఓడిపోయాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.