
హైదరాబాద్: పీఎస్‌ఏ ప్రపంచ ఛాంపియన్ షిప్‌లో భాగంగా జరుగుతున్న లీగ్‌లో భారత్‌కు చెందిన సౌరవ్ గోసల్ రెండో రౌండ్‌లోకి ప్రవేశం దొరికింది. మొత్తం భారత్ కు చెందిన ముగ్గురు ఆటగాళ్లు మొదటి రౌండ్ లో ప్రత్యర్థులతో వేర్వేరుగా తలపడగా కేవలం గోసల్ ఒక్కడే తర్వాతి దశకి ప్రవేశించాడు.
ఆట చివరి పది నిమిషాల్లో ప్రత్యర్థి జట్టు అభ్యర్థి గట్టి పోటీ ఇచ్చి ఇబ్బంది పెట్టాడు. అయితే 31సంవత్సరాల గోసల్ ప్రత్యర్థి విల్‌స్ట్రాప్‌ను బలంగా ఎదుుర్కొని 11 పాయింట్లు సాధించాడు. విల్‌స్ట్రాప్‌కు 6 పాయింట్లే రావడంతో 5 పాయింట్ల ఆధిక్యాన్ని సొంతం చేసుకున్న గోసల్ రెండో రౌండ్‌కు ప్రవేశించాడు.
"లీగ్‌లో భాగంగా ఒక్కో మ్యాచ్ ఒక్కో ప్రాంతంలో జరుగుతుంటుంది. వాతావరణ పరిస్థితులు కూడా మ్యాచ్‌పై ప్రభావం చూపొచ్చు. నాకైతే ఇక్కడ బాగానే ఉంది. అందుకే బాగా ఆడగలిగాను. ప్రస్తుతం గ్లాసు కోర్టులో ఆడుతున్నాను. ఇదొక గొప్ప అనుభవం" అని గోసల్ అభిప్రాయపడ్డాడు.
"ఓడినా గెలిచినా పాఠం నేర్చుకోవాలి. ప్రస్తుతం మనమున్న స్థాయి మనమేంటో చెబుతుంది. నేను ఎప్పుడూ ముందుకు వెళ్లేందుకు కష్టపడతాను. నాకు ఈ టోర్నమెంట్ బాగా నచ్చింది. నేను ఖచ్చితంగా గెలుస్తాననే నమ్మకముంది." అని తన మనోభావాలను మీడియాతో పంచుకున్నాడు.
కాగా, గోసల్ ఈ గెలుపుతో ప్రపంచ స్థాయిలో 16 వ ఆటగాడిగా జాబితాలో చేరాడు. ఇతనితో పాటు ప్రత్యర్థులతో తలపడిన వారి వివరాలిలా ఉన్నాయి.
* మంగాంకర్ 8-11 తేడాతో ఇంగ్లాండ్ డేరీల్ చేతిలో ఓడిపోయాడు.
* హరిందర్ పాల్ సింగ్ సంధు 5-11 తేడాతో బెన్ కొలెమాన్ చేతిలో పరాజయం పాలైయ్యారు.
ఫలితాలు:
డేరీల్ సెల్డీ (ఇంగ్లాండ్) తో మహేశ్ మంగాంకర్ (భారత్) 3-0: 11-8, 11-5, 11-5(36 మీ)
సౌరవ్ గోసల్(భారత్) తో జేమ్స్ విల్‌స్ట్రాప్ (ఇంగ్లాండ్) 3-0: 11-6 (10మీ) ప్రత్యర్థి తప్పుకున్నాడు.
బెన్ కొలెమన్ (ఇంగ్లాండ్) తో హరిందర్ పాల్ సింగ్ సంధు (భారత్) 3-0: 11-4, 11-6, 11-4
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ ,