గీతా రాణి డోపియే: సుదీర్ఘ నిషేధం, కెరీర్ ముగిసినట్లేనా?
న్యూఢిల్లీ: కామన్వెల్త్ గేమ్స్ వెయిట్ లిఫ్టింగ్‌వో స్వర్ణ పతక విజేత గీతా రాణి డోపీయేనని తేలింది. ఆమె నుంచి సేకరించిన బి-నమూనా పరీక్షలోనూ నిషేధిత ఉత్ప్రేరకాలు తీసుకున్నట్టు బయటపడింది. ఈ పరిణామంతో గీతారాణి కెరీర్ ఆగమ్యగోచరంగా మారింది.
ఫిబ్రవరిలో జరిగిన జాతీయ క్రీడల సందర్భంలో గీతారాణి నిషేధిత ఉత్ప్రేరకాలు తీసుకున్నట్టు ఇటీవలే చేసిన ఎ-నమూనా పరీక్షల్లో తేలడం, అనంతరం ఆమెపై తాత్కాలిక నిషేధం విధించడం తెలిసిందే. తాజాగా ఆలిండియా పోలీస్ మీట్‌లో సేకరించిన నమూనాలపై చేసిన పరీక్షలోనూ గీతా డ్రగ్స్ తీసుకున్నట్టు వెల్లడైంది.

బి-నమూనాపై జరిపే పరీక్షలోనూ ఆమె ఉత్ప్రేరకాలు తీసుకున్నట్టు వెల్లడైతే, ఆమె రెండోసారి డోపీగా తేలినట్టు పరిగణించి గీతాపై నాడా ఎనిమిదేళ్ల పాటు నిషేధం విధించే అవకాశముంది.
పంజాబ్‌కు చెందిన ఈ 34 ఏండ్ల లిఫ్టర్ 2006 కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకం, 2004 ఆసియా చాంపియన్‌షిప్‌లో మూడు రజతాలు సాధించి సత్తా చాటింది. రిటైర్మెంట్‌కు దగ్గరపడ్డ ఈ వయసులో ఎనిమిదేళ్లపాటు నిషేధం విధిస్తే గీతారాణి కెరీర్ ముగిసినట్టే!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications