Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ప్రొ రెజ్లింగ్ లీగ్ 3: రెజ్లర్ల ర్యాంప్ వాక్, డ్యాన్స్

Geeta Phogat, Sakshi Malik Show Off Dance Moves On The Ramp

హైదరాబాద్: కామన్ వెల్త్ క్రీడల స్వర్ణ విజేత గీతా ఫోగట్ తన డ్యాన్స్ తో మురిపించింది. ఒలింపిక్ కాంస్య విజేత సాక్షి మాలిక్ ర్యాంప్ వాక్ చేసింది. వీరితో పాటు మరికొందరు క్రీడాకారులు తమ విన్యాసాలను ప్రదర్శించారు.

ప్రొ రెజ్లింగ్ లీగ్ 3 ప్రారంభోత్సవ సందర్భంగా క్రీడాకారులందరూ తమ తమ స్థాయిలో ప్రదర్శన చేసి వీక్షకుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. గీతా ఫోగట్ డ్యాన్స్ చేయగా, సాక్షి, హెలెన్ మారొలీస్, మార్వా అమ్రీ, తాయ్లా, పుణ్యా, ర్యాంప్‌పై హోయలొలికించారు.

Sangram Disagrees With Sakshi Malik On Lack Of Facilities For WC Poor Show

గీతా తన జీవితంపై తీసిన సినిమాలోని దంగల్ పాటకు నృత్యం చేశారు. ఈమెతోపాటుగా ప్రపంచ ఛాంపియన్ మారొలీస్ జత కలసి చిందేశారు. అనంతరం హెలెన్ మారొలీస్ మాట్లాడుతూ.. పీడబ్ల్యూఎల్‌-3లో భాగం కావడం చాలా ఆనందంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఈ లీగ్‌కు ఆదరణ ఉంది. లీగ్‌ ప్రారంభం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానంటూ సంబరపడింది.

నేను ఇంత గొప్ప వేదికను ఎప్పుడూ చూడలేదు. పీడబ్లూఎల్ రెజ్లర్లకు ఓ మంచి ప్లాట్‌ఫామ్ అని కొనియాడింది. ఇక్కడ రెజ్లింగ్ ఒక్కటే కాదు ఇంకా చాలా రకాల యాక్టివిటీస్‌ను ప్రదర్శించేందుకు మంచి అవకాశం అంటూ వ్యాఖ్యానించింది.

ఎప్పుడూ రింగ్‌లో ప్రత్యేక దస్తుల్లో కనిపించడంతో వేదికకు కొత్త కళ వచ్చినట్లైంది. ఆటగాళ్లు ఫ్యాషన్‌ దుస్తులు ధరించి ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఇంకా ఈ వేదికపై రాహుల్, సరితా మన్న్, పవన్, సత్యవ్రాత్ అలరించారు. ఈ లీగ్ 2018 జనవరి మొదటి వారం ప్రారంభం కానుంది.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Saturday, December 23, 2017, 12:55 [IST]
Other articles published on Dec 23, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+