సింగపూర్: మ్యాచ్ గెలవడం కోసం ఏకంగా టెన్నిస్ కోర్టులోనే తన జుట్టును కత్తిరించుకుంది రష్యాకు చెందిన ఓ క్రీడాకారిణి. అందరూ చూస్తుండగానే స్వెట్లానా కుజ్నేత్సోవా తన జట్టుని కత్తిరించుకుని ఆశ్చర్యానికి గురి చేసింది. సింగపూర్‌లో జరుగుతున్న డబ్ల్యూటీఏ ఫైనల్స్ టోర్నమెంట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.
డబ్ల్యూటీఏ ఫైనల్స్‌లో భాగంగా సింగపూర్‌లోని ఇండోర్ స్టేడియంలో సోమవారం జరిగిన మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ రద్వాంస్కాతో తలపడింది. ఈ మ్యాచ్‌లో తొలి సెట్‌ను 7-5తో కుజ్నేత్సోవా సొంతం చేసుకోగా రెండో సెట్‌ను 1-6 తేడాతో కోల్పోయింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
అయితే రెండో సెట్‌లో తన ఓటమికి తన జుట్టనేని భావించిన కుజ్నేత్సోవా ముూడో సెట్‌కు ముందు కోర్టులోనే తన జడను కత్తిరించుకుంది. రెండో సెట్ ముగిసిన అనంతరం అంఫైర్‌ను అడిగి కత్తెర తెప్పించుకుని జట్టు చివర్లో కత్తిరించుకుంది.
జుట్టు కత్తిరించుకున్న అనంతరం కుజ్నేత్సోవా తీవ్ర ఉద్వేగానికి లోనై మూడో సెట్‌లో తన ప్రత్యర్ధిపై ఊహించని విధంగా షాట్లను ఆడింది. దీంతో మూడో సెట్‌లో కుజ్నేత్సోవా 7-5తేడాతో విజయం సాధించింది. దీంతో విజేత ఎవరో నిర్ణయించే మూడో సెట్‌లో కుజ్నేత్సోవా గెలిచింది.
మ్యాచ్ అనంతరం కుజ్నేత్సోవా మాట్లాడింది. ఆట మధ్యలో తన జడ చాలా ఒత్తిడి కలిగించిందని చెప్పింది. హెడ్‌బ్యాండ్ వెనుక పెట్టేందుకు ప్రయత్నించినప్పటికీ జుట్టు ఒత్తుగా ఉండటంతో అది కుదరలేదని పేర్కొంది. అంతేకాదు షాట్ కొడుతున్న ప్రతిసారీ జట్టు ముందుకు పడి తన కళ్లకు తగలడం వల్ల తీవ్ర ఇబ్బందిని కలిగించిందని చెప్పింది.